చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెంట్. ఆమె ట్విన్స్ కి జన్మనివ్వబోతుంది. ఈ సమయంలో ఉపాసనకు ఎక్కువ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో, సుకుమార్ ప్రాజెక్ట్ ని హోల్డ్ చేశారట. అయితే ఈ గ్యాప్ లోనే సుకుమార్ మరో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అదే ప్రభాస్ – విజయ్ దేవరకొండ కాంబో ప్రాజెక్ట్! మరి ఇది నిజమైతే మాత్రం టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. ప్రభాస్ రేంజ్ ఏంటి అనేది అందరికి తెలుసు. విజయ్ దేవరకొండ కూడా తన యంగ్ ఎనర్జీ, మాస్ అప్పీల్ తో నెక్స్ట్ లెవల్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ కు అది “డబుల్ ధమాకా”, “డబుల్ ఫీస్ట్” అని చెప్పాల్సిందే.
ఇక సుకుమార్ దర్శకత్వం అంటే సినిమాటిక్ విజువల్ మ్యాజిక్, ఇంటెన్స్ ఎమోషన్స్, క్లాస్ టచ్ తో మాస్ ఎలిమెంట్స్ మిక్స్ ఉండటం ఖాయం. “ఆర్య”, “రంగస్థలం”, “పుష్ప” లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఆయన ఇప్పటికే తన ప్రత్యేకతను చూపించారు. అలాంటి డైరెక్టర్ చేతిలో ప్రభాస్-విజయ్ దేవరకొండ కాంబో వస్తే ఊహించుకోండి ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుందో! “ఇది జరిగితే ఇండియన్ సినిమాకే న్యూ రికార్డ్ ఖాయం!”. “సుకుమార్ బ్రెయిన్ + ప్రభాస్ మాస్ + విజయ్ ఎనర్జీ = అన్ స్టాపబుల్ బ్లాక్ బస్టర్! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ మరియు విజయ్ దేవరకొండ ఒకే సినిమాలో కలిసి కనిపించిన సందర్భం లేదు. అలాగే ఈ ఇద్దరినీ సుకుమార్ ఇప్పటివరకు డైరెక్ట్ చేయలేదు. అంటే ఈ ప్రాజెక్ట్ త్రిపుల్ ఫ్రెష్ కాంబినేషన్ గా ఉండబోతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ మొదలైందని, కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్. ఒకవేళ ఇది అధికారికంగా కన్ఫర్మ్ అయితే టాలీవుడ్ హిస్టరీలోనే పెద్ద మల్టీస్టారర్ మూవీగా ఇది నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి సుకుమార్ టీమ్ నుండి వచ్చే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మీదే ఉంది. ఈ కాంబినేషన్ నిజం అయితే మాత్రం — “ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్లే మల్టీస్టారర్ ఇదే అవుతుంది” అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. చూడాలి మరి... ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది..? సుకుమార్, ప్రభాస్, విజయ్ దేవరకొండ కాంబో ఎప్పుడు సెట్ అవుతుంది ..? అన్నది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి