సినిమా ఇండస్ట్రీకి కీలకమైన నెలలలో అక్టోబర్ ఒకటి. అక్టోబర్ నెలలో విడుదలైన సినిమాల్లో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తాయనే పేరు ఉంది. ఆ మ్యాజిక్ ఈ నెలలో కూడా రిపీట్ అయిందనే చెప్పాలి. అక్టోబర్ నెల 2వ తేదీన విడుదలైన కాంతార చాప్టర్1 సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 850 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది.

అక్టోబర్ నెల రెండో వారం శశివదనే, అరి,  కానిస్టేబుల్ సినిమాలు రిలీజ్ కాగా  ఈ మూడు సినిమాలలో ఏ సినిమాకు ఆశించిన టాక్ రాలేదు.   దీపావళి పండుగ కానుకగా మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కే  ర్యాంప్ రిలీజ్ కాగా డ్యూడ్, కే  ర్యాంప్ సినిమాలు హిట్ అయ్యాయి. కే  ర్యాంప్ టార్గెట్ తక్కువ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. డ్యూడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

ప్రదీప్ రంగనాథన్  గత సినిమాల స్థాయిలో లేకపోయినా డ్యూడ్ సినిమా కమర్షియల్ గా హిట్ గా నిలిచింది.  మిత్రమండలి, తెలుసు కదా సినిమాలు మాత్రం ఒక సినిమాను మించి మరొకటి ప్లాప్ అయ్యాయి.  అక్టోబర్ నెల చివరి వారంలో మాస్ జాతర, బైసన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. బైసన్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే  సినిమా అయితే కాదనే సంగతి తెలిసిందే.

మాస్ జాతర సినిమా నాగవంశీకి భారీ షాకిచ్చింది. ఈ సినిమా ఫుల్ రన్ లో డబుల్ డిజిట్ కలెక్షన్లను సాధించడం కష్టమేనని చెప్పవచ్చు. ప్రీమియర్స్ కు 5 కోట్ల  రూపాయల కలెక్షన్లు  వచ్చాయని మేకర్స్ చెబుతున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: