ప్రశాంత్ వర్మకు బిగ్ షాక్ తగిలిందా.. నిజంగానే ఆ పాన్ ఇండియా మూవీ ఆగిపోయిందా.. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు సోషల్ మీడియాలో వచ్చే ఈ వార్తల్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రశాంత్ వర్మ హను-మాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు.ఇక ఈ సినిమా తర్వాత ఆయన ప్రకటించిన రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ హైప్ ఏర్పడింది.అలా హను-మాన్ తర్వాత జై హనుమాన్ మూవీ తో పాటు బ్రహ్మ రాక్షస అనే సినిమాని కూడా అనౌన్స్ చేశారు. అలాగే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ గా కూడా ప్రశాంత్ వర్మనే అని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే జై హనుమాన్ మూవీ కి సంబంధించి రిషబ్ శెట్టిని హీరోగా పెడుతున్నట్టు అఫీషియల్ గా రిషబ్ శెట్టి రాముడు విగ్రహాన్ని చేతిలో పట్టుకున్న పోస్టర్ కూడా విడుదల చేశారు. 

ఇక ఈ విషయం పక్కన పెడితే బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస మూవీ అనుకున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. అలాగే రణవీర్ సింగ్ ఇక్కడికి వచ్చి కొంతమేర షూటింగ్ చేసినట్టు కూడా రూమర్స్ వినిపించాయి. కానీ సడన్గా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.రణవీర్ సింగ్ ని అందులో నుండి తీసేశారు.ఆ తర్వాత ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షస మూవీకి ప్రభాస్ ని అనుకున్నట్టు రూమర్స్ వినిపించాయి.ముఖ్యంగా ప్రభాస్ హోంబలే ఫిలిమ్స్ తో మూడు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట. అందులో ఒకటి సలార్-2 కాగా మరో ఇద్దరు దర్శకులను ఎంచుకునే ఛాన్స్ కూడా హోంబలే చిత్ర నిర్మాతలు ప్రభాస్ కి ఇచ్చారట.అలా ప్రభాస్ ప్రశాంత్ వర్మని ఎంచుకున్నారట. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోయే బ్రహ్మ రాక్షస సినిమాలో ప్రభాసే హీరో అని ఎన్నో వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా బ్రహ్మ రాక్షస సినిమా ఆగిపోయినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమాని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దానికి కారణం రీసెంట్గా ప్రశాంత్ వర్మ ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడమే. గత కొద్ది రోజుల నుండి నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణ సంస్థ అయినటువంటి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ తో ప్రశాంత్ వర్మకి విభేదాలు వచ్చాయని, ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ తీసుకొని సినిమాలు చేయట్లేదు అనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయం ప్రభాస్ కు తెలియడంతో ఇలాంటి చిక్కుల్లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయకూడదని నిర్ణయించుకొని సేఫ్ సైడ్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.అలా బ్రహ్మ రాక్షస సినిమా మధ్యలోనే ఆగిపోయినట్టు సమాచారం. మరి ప్రభాస్ నిజంగానే ప్రశాంత్ వర్మని పక్కన పెట్టారా.. బ్రహ్మ రాక్షస మూవీ మధ్యలోనే అయిపోయిందా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: