ప్రతి సంవత్సరం దీపావళి పండుగ వచ్చింది అంటే చాలు దీపావళి పండుగ సందర్భంగా చాలా సినిమాలను మేకర్స్ విడుదల చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా దీపావళి సందర్భంగా చాలా సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా భారీ క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు ఏవి విడుదల కాలేదు. కానీ చిన్న హీరోల మరియు మీడియం రేంజ్ హీరోల సినిమాలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర సందడి చేశాయి. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా మొదటగా ప్రియదర్శి హీరోగా రూపొందిన మిత్ర మండలి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన తెలుసు కదా , కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన కే ర్యాంప్ తమిళ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించిన డ్యూడ్ సినిమాలు విడుదల అయ్యాయి. ఈ నాలుగు సినిమాలు కూడా మంచి అంచనాల నడమ విడుదల అయ్యాయి. మొదట విడుదల అయిన మిత్ర మండలి సినిమాకు భారీ నెగటివ్ వచ్చింది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక తెలుసు కదా సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి ప్రభావాన్ని చూపలేదు. డ్యూడ్ మూవీ కి మంచి టాక్ వచ్చింది. దానితో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు కూడా దక్కాయి. కానీ ఈ మూవీ కి పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ చేసుకోలేక పోయింది. ఇక కే ర్యాంప్ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంది. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల అయిన నాలుగు సినిమాల్లో కే ర్యాంప్ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: