తెలుగు సినీ పరిశ్రమలో లెజెండ్రీ యాక్టర్ గా పేరు సంపాదించిన మోహన్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు సినిమాలలో విలన్ గా, నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలను నిర్మించారు. సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ గా పేరు సంపాది.అలాగే విద్యావేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీతగా పేరు సంపాదించారు మోహన్ బాబు. ఈ ఏడాదితో తాను ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి కావస్తోంది. దీంతో నవంబర్ 22న ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 22న MB50 ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్ (MB50-A Pearl White Tribute)అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

మోహన్ బాబు తన 50 ఏళ్ల సుదీర్ఘ సిని ప్రయాణంలో 600కు పైగా చిత్రాలలో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన మోహన్ బాబు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. మోహన్ బాబు మొదటిసారిగా హీరోగా నటించిన స్వర్గం నరకం చిత్రం 1975 నవంబర్ 22న రిలీజ్ అయ్యింది. దీంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు మోహన్ బాబు. భారతీయ నటుడుగా సినీ ఇండస్ట్రీకి ఆయన సేవలను గుర్తు చేస్తూ ఈ  వేడుకను చాలా గ్రాండ్ గా జరుపుకోవాలని ఆయన కుమారుడు మంచు విష్ణు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ వేడుకలో చాలామంది సినీ సెలబ్రిటీలు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మంచు కుటుంబం కూడా ఒకే వేదికపై కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. గత  కొన్ని నెలల క్రితం మంచు ఫ్యామిలీలో వివాదాలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆస్తి వ్యవహారంలో అటు మోహన్ బాబు ఆయన కుమారుడు మనోజ్ మధ్య విభేదాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ తర్వాత నెమ్మదిగా అన్ని సర్దుకున్నప్పటికీ మనోజ్ మాత్రం కుటుంబంతో కాకుండా వేరుగా ఉంటున్నారు. ఇక మంచు లక్ష్మి కూడా తన కెరీర్ కోసం ముంబైలో ఉంటున్న సంగతి తెలిసింది ఇలా అందరూ కూడా ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు MB50- ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్ కార్యక్రమానికి కుటుంబం అంతా కలిసి కనిపించి పూర్వవైభవాన్ని తన కుటుంబానికి  తీసుకురావాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మోహన్ బాబు కూడా తన కుటుంబాన్ని అంత ఈ వేదికపై చూడాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: