ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ తో రిలేషన్ లో ఉన్నట్లుగా ఎక్కువగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో నటించడంతో ఆ విషయం మరింత వైరల్ గా మారింది. వీరిద్దరూ మంచి స్నేహితులమని తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ.. తన సోదరుడు సమీర్, అజయ్ మంచి స్నేహితులని తనకు 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవరైనా అబ్బాయిలు(ప్రేమ) తన వెంట పడితే మాత్రం తన అన్నయ్యతో కలిసి అజయ్ వెళ్లి మరి వారిని కొట్టే వారిని దీంతో అబ్బాయిలు సైతం తనతో మాట్లాడడానికి, చూడటనికి కూడ భయపడేవారు అంటూ వెల్లడించింది.
తెలుగులో నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నటించిన సమయంలో నాగార్జునతో సంథింగ్ సంథింగ్ ఉన్నట్లుగా వినిపించాయి . కానీ తాము కూడా మంచి స్నేహితులమని తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి టబు. నాగార్జున, టబు కెమిస్ట్రీ కూడా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. టబు కూలి నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా..అందరివాడు, చెన్నకేశవరెడ్డి, ఆవిడ మా ఆవిడ, పాండురంగడు తదితర చిత్రాలలో నటించింది టబు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి