సమంత మాట్లాడుతూ..“పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా.. మావా’ అనే ఐటమ్ సాంగ్ చేయొద్దని చాలామంది నన్ను హెచ్చరించారు. అప్పుడు నేను కొత్తగా డివోర్స్ తీసుకున్న టైమ్. ఇలాంటి సమయంలో ఇలాంటి బోల్డ్ సాంగ్ చేస్తే నీ ఇమేజ్ దెబ్బతింటుంది, కెరీర్ స్పాయిల్ అవుతుంది అని చాలా మంది మంచి స్నేహితులు సలహా ఇచ్చారు. కానీ వాళ్ల మాట నేను పట్టించుకోలేదు. నేను నా మనసు మాట విన్నాను. ఆ పాటలో నటించడం పూర్తిగా నా ఇష్టప్రకారం జరిగింది. ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు ఆ నిర్ణయం నాకు చాలా మేలు చేసింది అనిపిస్తోంది. అయితే ఆ తర్వాత మాత్రం నేను ఇలాంటి ఐటమ్ సాంగ్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను,” అని చెప్పింది.
సఇప్పుడు అదే మాటలను మరో యంగ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా మాట్లాడటంతో ఈ చర్చ మళ్లీ రీ-ఆన్ అయింది.ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీలీల కూడా చాలా నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెప్పింది. “పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అల్లు అర్జున్ గారితో స్క్రీన్ పంచుకోవడం నా కెరీర్‌లో స్పెషల్ అనుభవం. కానీ ఇకపై మాత్రం నేను ఐటమ్ సాంగ్స్ చేయకూడదని అనుకుంటున్నాను. ఈ ఒకసారి అనుభవం చాలు, ఇక మీదట నా ఫోకస్ పూర్తిగా క్యారెక్టర్ రోల్స్, కంటెంట్ డ్రివెన్ సినిమాలపైనే ఉంటుంది,” అని ఆమె స్పష్టంగా తెలిపింది.
ఇలా చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు “ఇది సమంత చెప్పిన మాటే కదా!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. “ఇద్దరికీ ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా?” అంటూ కొందరు ఘాటు రియాక్షన్స్ ఇస్తుండగా, “హీరోయిన్స్ కూడా కాలంతో పాటు ఎదుగుతున్నారు, వాళ్లకు కూడా జీవితం మీద అవగాహన పెరుగుతోంది” అని కొందరు సమర్థిస్తున్నారు.అసలే ఐటమ్ సాంగ్స్ అనే కాన్సెప్ట్ పై చాలాకాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది. కొందరు దానిని సినీ గ్లామర్‌లో భాగంగా చూస్తే, మరికొందరు అది మహిళల పాత్రలను చిన్నచూపు చూపించే అంశంగా విమర్శిస్తారు. ఇప్పుడు సమంత, శ్రీలీల లాంటి టాప్ హీరోయిన్స్ ఇద్దరూ “ఇకపై ఇలాంటి పాటలు చేయం” అని చెప్పడం ఆ చర్చకు కొత్త కోణం ఇచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి