బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో ఏ ఈవెంట్ కు పిలిచినా సరే తన మాట తీరుతో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది సినీ సెలబ్రిటీలకు పరోక్షంగా కౌంటర్లు విసురుతూ అప్పుడప్పుడు పేర్లతో సహా కౌంటర్లు ఇస్తూ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.కొంతమంది అయితే అసలు మైక్ దొరకడమే ఆలస్యం బండ్ల గణేష్ తన ప్రసంగాలతో అందర్నీ ఏకిపారేస్తున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా బండ్ల గణేష్ కే ర్యాంప్ సక్సెస్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ను పరోక్షంగా ఏకిపారేశారు. ఒక్క హిట్ కొడితే చాలు కొంతమంది హీరోలు కొత్త చెప్పులు, లూజు ప్యాంట్లు వేసుకొని తెగ ఓవరాక్షన్ చేస్తారు అన్నట్లుగా మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలు విజయ్ దేవరకొండనే అన్నట్లుగా ఆయన ఫ్యాన్స్ భావించి బండ్ల గణేష్ కి సోషల్ మీడియాలో వార్నింగ్ లు ఇస్తున్నారు.

 అంతేకాదు ఊసరవెల్లి బండ్ల గణేష్ అంటూ కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే గతంలో లిటిల్ హార్ట్స్ మూవీ ఈవెంట్ లో కూడా బండ్ల గణేష్ అల్లు అరవింద్ ను టార్గెట్ చేసి కౌంటర్ ఇచ్చినట్టుగా మాట్లాడాడు. బన్నీ వాసు, వంశీ ఇద్దరు కలిసి కష్టపడితే చివర్లో వచ్చి అల్లు అరవింద్ క్రెడిట్ కొట్టేశారు. ఇది ఎవరి సినిమా అంటే అల్లు అర్జున్ సినిమా అనేలా చేశారు. అల్లు అరవింద్ చివరి నిమిషంలో వచ్చి సినిమాకి వచ్చిన పేరు అంతా కొట్టేశారు. అంటూ చాలా దారుణంగా మాట్లాడారు. ఇక ఈ వ్యాఖ్యలపై బన్నీవాసు కూడా మిత్రమండలి మూవీ ఈవెంట్లో బండ్ల గణేష్ వ్యాఖ్యలు మమ్మల్ని కూడా కాస్త ఇబ్బంది పెట్టాయి. ఆయన అలా మాట్లాడి ఉండకూడదని చెప్పారు.

ఆ తర్వాత బన్నీ వాసుకి పరోక్షంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కౌంటర్ ఇచ్చారు బండ్లన్న. ఇదంతా పక్కన పెడితే తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ పాల్గొనగా.. అక్కడికి వచ్చిన కొంత మంది జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ మీ మీద కౌంటర్లు పేలుస్తున్నారు. చివర్లో వచ్చి క్రెడిట్ కొట్టేస్తారు అని అన్నారు.ఈ మాటల వల్ల మీరు చాలా బాధపడ్డారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.దీనిపై మీ స్పందన ఏంటి అని అడగగా.. నాకంటూ ఒక స్థాయి ఉంది.. వాటి గురించి నేను మాట్లాడను అంటూ ఒకే ఒక్క సింపుల్ ఆన్సర్ తో బండ్ల గణేష్ నోరు మూయించేశారు.ఇక అల్లు అరవింద్ ఇచ్చిన ఆన్సర్ తో బండ్ల గణేష్ మూసుకొని కూర్చుంటే మంచిది అంటూ అల్లు ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. మరి అల్లు అరవింద్ కామెంట్స్ పై బండ్ల గణేష్ మళ్లీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: