ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, వంటి స్టార్ యాక్టర్ల స్పెషల్ అపీరియనెన్స్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ఇక ‘జైలర్ 2’లో కూడా అలాంటి భారీ కేమియోలు ఉండబోతున్నాయని, ఆ జాబితాలో టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు కూడా ఉండబోతుందని గత కొన్ని వారాలుగా కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు గట్టిగా వినిపించాయి.బాలయ్య, రజనీకాంత్ ఇద్దరూ సౌత్ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్లు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అది అభిమానులకు విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. అందుకే ఈ వార్త వెలువడిన వెంటనే బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు, రజనీకాంత్ అభిమానులు కూడా ఉత్సాహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో “బాలయ్య ఇన్ జైలర్ 2” అనే హ్యాష్‌టాగ్ కూడా వైరల్‌గా మారిపోయింది.
కానీ తాజాగా కోలీవుడ్ మీడియా వర్గాల నుంచి వచ్చిన తాజా సమాచారం మాత్రం నందమూరి అభిమానులను కాస్త షాక్‌లోకి నెట్టేసింది. ఎందుకంటే ‘జైలర్ 2’లో కేమియో రోల్ కోసం బాలయ్యకు ఆఫర్ ఇచ్చినా, ఆయన ఆ ఆఫర్‌ను వినయంగా తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి.దీనికి గల కారణాలపై కూడా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరి ప్రకారం బాలయ్య ప్రస్తుతం తన స్వంత సినిమా “అఖండ 2” షూటింగ్‌తో బిజీగా ఉన్నారని, ఆ షెడ్యూల్స్ కారణంగా డేట్స్ కుదరక ఈ ఆఫర్‌ను వదులుకున్నారని చెబుతున్నారు. మరికొందరి వాదన ప్రకారం, బాలయ్య లాంటి స్టార్ యాక్టర్ ఒక చిన్న కేమియో రోల్‌లో నటించడం తన ఇమేజ్‌కి సరిగ్గా సరిపడదని భావించాడని అంటున్నారు.ఇక ఇంకొంతమంది మాత్రం “బాలయ్య, రజనీకాంత్ ఇద్దరూ ఒకే స్క్రీన్ మీద కనబడితే ఆ సీన్ మొత్తాన్ని ఎవరు క్యారీ చేస్తారన్న విషయం మీద డైరెక్టర్‌కు కూడా క్లారిటీ లేకపోవడం వల్లే ఈ ప్లాన్ డ్రాప్ అయ్యిందేమో” అని అనుకుంటున్నారు.ఏది ఏమైనా, బాలయ్య ‘జైలర్ 2’లో నటించడంలేదని వస్తున్న ఈ వార్త ఇప్పుడు నందమూరి అభిమానులకు నిజంగానే పెద్ద నిరాశ కలిగించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి