తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న నటులలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే ఆ తర్వాత సినిమాల్లో నటించాడు. ఈయన సినిమాల్లో వచ్చిన ప్రతి అవకాశాలు ఉపయోగించుకుంటూ అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. కెరియర్ ప్రారంభంలో ఈయన హీరో గా నటించిన సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. దానితో చాలా తక్కువ కాలం లోనే హీరోగా రవితేజ కు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజ నటించిన సినిమాలు వరుస పెట్టి బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి.

రవితేజ సినిమాల హిట్టు  ప్లాప్ విషయం పక్కన పెడితే రవితేజ తన వయసు కంటే చాలా తక్కువ వయసు ఉన్న హీరోయిన్లతో నటిస్తున్నాడు అని , అలాగే ఆయన సినిమాలలో హీరోయిన్ లేకుండా మూవీ చేస్తే బాగుంటుంది అని , ఒక వేళ హీరోయిన్ ఉన్నా కూడా తన వయసుకు తగ్గ నటీమణితో నటిస్తే బాగుంటుంది అని అభిప్రాయాలను కూడా కొంత మంది వ్యక్త పరచిన సందర్భాలు ఉన్నాయి. కానీ రవితేజ మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన రూట్లో తాను వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి మేకర్స్ టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఆర్తి 76 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి నటిస్తోంది. ఇప్పటికే రవితేజ , డింపుల్ హయాతి కాంబోలో కిలాడి అనే సినిమా వచ్చింది. ఈ మూవీలో డింపుల్ హయాతి అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఆర్ టి 76 మూవీ లో కూడా ఈ బ్యూటీ అందాలతో ఆ స్థాయి లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: