అయితే ఈ ఫోటోలలో శిరీష్ ధరించిన లుక్ ని చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఎంగేజ్‌మెంట్ లేదా పెళ్లి వేడుకల్లో మహిళలు మాత్రమే నెక్లెస్‌లు, ఆభరణాలు ధరించడం మనం చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం ట్రెండ్‌ను పూర్తిగా మార్చుతూ అల్లు శిరీష్ మెడలో ఒక ఖరీదైన డైమండ్ నెక్లెస్ ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చాడు. దీంతో ఆన్‌లైన్‌లో కామెంట్స్ ఊపందుకున్నాయి. కొంతమంది నెటిజన్లు —“శిరీష్ లుక్ చాలా క్లాస్‌గా ఉంది”..“డ్రెస్ అద్భుతంగా ఉంది, కానీ మెడలో నెక్లెస్ ఎందుకు?”..“అది కొంచెం ఓవర్‌గా అనిపిస్తోంది”..అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే కొన్ని మీమ్ పేజీలు కూడా ఈ ఫోటోలపై జోకులు వేస్తూ మీమ్స్ సృష్టించాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం శిరీష్ ట్రెండ్ సెట్ చేయడానికి ప్రయత్నించాడని, ఫ్యాషన్‌కి ఎలాంటి హద్దులు ఉండవని సమర్థిస్తున్నారు. ఇంతలో శిరీష్ ధరించిన ఆ నెక్లెస్‌పై కూడా ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.
ఆయన మెడలో వేసుకున్నది సాధారణ నెక్లెస్ కాదు, విక్టోరియన్ స్టైల్ డైమండ్ నెక్లెస్ అని తెలుస్తోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ డిజైన్ అని, దీని విలువ దాదాపు 10,000 అమెరికన్ డాలర్లు — అంటే దాదాపు 8 లక్షల రూపాయలు అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఫ్యాషన్‌కి, స్టైల్‌కి ప్రాధాన్యత ఇచ్చే అల్లు ఫ్యామిలీకి చెందినవాడిగా శిరీష్ ఎప్పుడూ కొత్తగా ఏదో ప్రయత్నించడం తెలిసిందే. ఈసారి కూడా ఆయన తన ఎంగేజ్‌మెంట్ వేడుకలో ఒక యూనిక్ ఫ్యాషన్ ఎలిమెంట్‌ను జోడించి, అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.ప్రస్తుతం అతడి ఫోటోలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి