మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా స్థాయి సినిమా రూపొందుతోందన్న సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మాస్ ప్రేక్షకుల్ని పులకరింపజేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నందుకు ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలవబోతుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. ఇక గత కొన్ని నెలలుగా ఈ సినిమా చుట్టూ అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. షూటింగ్ ఆగిపోయిందంటూ, లుక్ మారిందంటూ, కథ సెట్ అవ్వడం లేదంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ తాజాగా సినిమా యూనిట్ ఆ రూమర్స్‌కి ఒక్కసారిగా చెక్ వేసింది. ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది — ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ట్రాక్ మీద ఉందని, ఏదీ ఆగలేదని మేకర్స్ స్పష్టంగా తెలియజేశారు.


ఇటీవల తారక్ ఒక కొత్త లుక్ కోసం ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్ తో కలిసి ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఈ లుక్ ప్రిపరేషన్ మొత్తం దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా మానిటర్ చేస్తున్నారు. కొత్త గెటప్, కొత్త లుక్, మరింత పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఎన్టీఆర్ బీస్ట్ మోడ్‌లో కనబడబోతున్నాడని యూనిట్ తెలిపింది. ఈ కొత్త లుక్‌తో తారక్ కొత్త షెడ్యూల్‌కి సిద్దమవుతున్నాడని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ అభిమానులు ఈ లుక్ అప్‌డేట్‌తో పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది రూమర్స్ స్ప్రెడ్ చేసినట్లు ఈ సినిమా ఆగిపోలేదు, ఆలస్యం కాలేదు — కేవలం అత్యంత కేర్‌ఫుల్‌గా, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మాణం కొనసాగుతోందని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆ రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ల నోర్లు మూయించినట్లయింది.



ఈ భారీ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ కాంబినేషన్‌లో వస్తున్నందున, సినిమాపై ఇండస్ట్రీ అంతటా భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. ఇప్పటికే హాలీవుడ్ టెక్నీషియన్ల సపోర్ట్‌తో, భిన్నమైన విజువల్ స్టైల్‌తో ఈ సినిమా రూపొందుతోంది.తాజా అప్‌డేట్స్ ప్రకారం, నాలుగో షెడ్యూల్ షూటింగ్ వచ్చే నెలలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. క్లైమాక్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌లను నిర్మిస్తున్నారని సమాచారం. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టే కాకుండా, దాటేలా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.సో, మొత్తానికి తారక్ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మాస్ ఫైర్ వర్కౌట్ కావడం ఖాయం. ఎన్టీఆర్ బీస్ట్ మోడ్ లో దర్శనమివ్వబోతున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: