టాలీవుడ్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఫంకీ’ షూటింగ్ దశలో వేగంగా ముందుకు సాగుతోంది. ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించేందుకు ప్రయత్నించే విశ్వక్ సేన్, ఈసారి కూడా ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ ప్యాకేజీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అనుదీప్ ప్రత్యేకమైన హాస్యాన్ని, సిట్యువేషనల్ కామెడీని ఈ సినిమాలో మరింత రంజుగా ప్రెజెంట్ చేయనున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తోంది. ఆమె అందం, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుంది. విశ్వక్ సేన్ - కయాదు లోహర్ జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ చెబుతోంది.
కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవింపుతో ‘ఫంకీ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. వేసవి బరిలో ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు 2026 ఏప్రిల్ 3న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. సమ్మర్ సీజన్‌లో విడుదల కావడం వలన ఈ సినిమాపై ట్రేడ్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, నిర్మాతలుగా నాగ వంశీ మరియు సాయి సౌజన్య వ్యవహరిస్తున్నారు. టెక్నికల్‌గా, మ్యూజికల్‌గా కూడా సినిమా ఎంతో రిచ్‌గా రూపుదిద్దుకుంటోందట. అనుదీప్ తనదైన ఫన్ ట్రాక్‌ను కొనసాగిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే మరో హిట్‌ను అందించబోతున్నాడని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఫంకీ విశ్వక్ సేన్ కెరీర్‌లో మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాగా నిలుస్తుందనే హైప్ ఇప్పటికే ఏర్పడింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి