సీనియర్ నటి మీనా ప్రస్తుతం సినిమాలు చేస్తూ పలు షోలలో పాల్గొంటూ తన లైఫ్ లో ముందుకు వెళుతుంది.భర్త చనిపోయిన తరువాత సంవత్సరం పాటు ఇంట్లోనే డిప్రెషన్ లో ఉండిపోయిన మీనాకి మళ్ళీ సినిమాల్లో పనిచేయడం వల్ల కాస్త డిప్రెషన్ తొలిగిపోయి అందరితో కలిసిపోయిన భావన కలుగుతుందట. అందుకే ఎంత వీలైతే అంత బిజీగా గడుపుతూ సినీ రంగలో బిజీ గా ఉంటుంది. అయితే అలాంటి మీనా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. ఓ బాలీవుడ్ హీరో చేసిన పని వల్ల ఆ హీరో హోటల్ కి వెళ్లడానికి వణికిపోయిందట. మరి ఇంతకీ మీనాని ఇబ్బంది పెట్టిన ఆ బాలీవుడ్ హీరో ఎవరు? ఎందుకు హోటల్ కి వెళ్లడానికి భయపడి పోయింది అనేది ఇప్పుడు చూద్దాం..

 సీనియర్ నటి మీనా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనకి బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి అంటే చాలా భయం అంటూ చెప్పుకొచ్చింది.దానికి కారణం కూడా ఉంది.అదేంటంటే సీనియర్ నటి మీనాని సినిమాలో హీరోయిన్ గా చేసిన సమయంలో మిథున్ చక్రవర్తి చాలాసార్లు నా సినిమాలో హీరోయిన్ గా చేయమని ఫోర్స్ చేశారట. ముఖ్యంగా షూటింగ్ కోసం ఎప్పుడు ఊటీకి వెళ్లినా కూడా అక్కడ ఊటీలోని మిథున్ చక్రవర్తి హోటల్ లోనే చిత్ర యూనిట్ ఎక్కువగా ఉండేది. అయితే ఆ హోటల్ కి వెళ్ళిన ప్రతిసారి మిథున్ చక్రవర్తి మీనా దగ్గరికి వచ్చి నువ్వు నాతో కలిసి సినిమా ఎప్పుడు చేస్తావు అని ప్రతిసారి అడిగేవారట. అయితే అంత పెద్ద హీరో వచ్చి నన్ను ప్రతిసారి అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం అయ్యేది కాదు.

అయితే అప్పట్లో బాలీవుడ్ లో ఒక్క సినిమా చేసే సమయంలో సౌత్ లో మూడు నాలుగు సినిమాలు చేయవచ్చు. ఇక ఆ హీరో అనేకసార్లు అడిగినా కూడా నాకు ఇతర సినిమాల్లో అవకాశం ఉండి డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల ఆయనకు ఓకే చెప్పలేకపోయాను. అయితే ప్రతిసారి ఊటికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా నన్ను అడగడంతో చివరికి దర్శక నిర్మాతలకు ఊటికి సినిమా షూటింగ్ కి వెళ్తే నాకు ఆ హీరో హోటల్లో రూమ్ ఇవ్వకండి. వేరే హోటల్ రూమ్ బుక్ చేయండి అని అడిగేదాన్ని.అలా మిథున్ చక్రవర్తి వల్ల నేను ఆయన హోటల్ కి వెళ్లడం కూడా మానేశాను. ఎందుకంటే అంత పెద్దాయన అన్నిసార్లు సినిమా గురించి అడిగితే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు.అందుకే అలా చేశాను అంటూ మీనా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: