ఇక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే - ఈ పార్ట్‌లో ఒక బాలీవుడ్ స్టార్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడట! ఆ హీరో పేరు ఇప్పటివరకు గోప్యంగానే ఉంచినా, హిందీ మార్కెట్‌కి ఈ కాంబినేషన్ షాక్ ఇస్తుందని ఫిలింనగర్ టాక్. మరోవైపు, ఈ సీక్వెల్‌లో మరో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. మొదటి భాగంలో గ్లామర్ అండ్ ఎమోషన్ మేళవించిన జాన్వీ కపూర్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రెండో పార్ట్‌లో ఆమెతో పాటు మరో నటి చేరడం సినిమాపై ఆసక్తి పెంచింది. విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ తన మార్క్ యాక్టింగ్‌తో మాస్ ఫ్యాన్స్‌ను సైతం ఇంప్రెస్ చేశారు. ఆయన పాత్రకు కొనసాగింపుగా సీక్వెల్‌లో మరింత స్ట్రాంగ్ యాంగిల్ ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మళ్లీ ఈ సీక్వెల్‌కి ట్యూన్ అందిస్తున్నాడు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ‘దేవర’ మొదటి పార్ట్‌లోనే సినిమాకు కొత్త స్థాయి తీసుకెళ్లింది. అందుకే ఈసారి అనిరుధ్ మ్యూజిక్ కోసం కూడా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక టెక్నికల్ వర్క్ విషయంలోనూ కొరటాల శివ ఎలాంటి రాజీ లేకుండా, హాలీవుడ్ లెవెల్‌లో క్వాలిటీ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్‌లు, రియల్ లొకేషన్లు, అండర్‌వాటర్ సీక్వెన్సెస్ — అన్నీ మరోసారి విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతున్నాయని టీమ్ చెబుతోంది. ‘దేవర 2’ అంటే ఎన్టీఆర్ కెరీర్‌లోనే మరో మైలురాయి అవుతుందని ట్రేడ్ సర్కిల్స్ బజ్. ఇక అభిమానులు మాత్రం ఒకే మాట చెబుతున్నారు - “సముద్రం మరోసారి మోగబోతోంది.. ఈసారి అల పెద్దదే!”
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి