టాలీవుడ్‌లో అందం, అభినయం, టాలెంట్—అన్ని వావ్ అనిపించుకున్న హీరోయిన్  ఎవరు అంటే చాలా మంది ఉన్నారు. అందులో అంజలి కూడా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇప్పటికే మంచి మంచి సినిమాలతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అంజలి.. మళ్లీ ఒకసారి పెద్ద స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న, దర్శకుడు బాబీ కొల్లీ  దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌ లో అంజలి ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే చిరంజీవిబాబీ కాంబినేషన్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్ తో, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ తో నిండిపోనుందని టాక్. ఈ క్రమంలో అంజలి ఎంట్రీ ఆ సినిమాకు మరింత గ్లామర్‌ యాడ్ చేయనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


గతంలో అంజలి "సరైనోడు" సినిమాలో అల్లు  అర్జున్ కోసం చేసిన స్పెషల్ సాంగ్  ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ పాటలో అంజలి తన ఎనర్జీ, డ్యాన్స్ మూవ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సాంగ్ తర్వాత ఆమెకు కొత్త ఇమేజ్ దక్కింది. ఇప్పుడు అదే తరహాలో మెగాస్టార్ కోసం స్టెప్స్ వేయబోతోందని తెలుస్తోంది. ఇక ఈ స్పెషల్ సాంగ్‌ కోసం భారీ సెట్ కూడా వేస్తున్నారని, మ్యూజిక్ డైరెక్టర్ సెట్ చేసిన బీట్ లు కూడా సూపర్ ఎనర్జీగా ఉన్నాయని సమాచారం. ఇది మాస్ ఆడియెన్స్ ను థియేటర్లలో కాళ్లు కదిలించే రేంజ్‌లో ఉంటుందట.



ఇంతకీ అంజలి లుక్ ఎలా ఉండబోతోందనే కుతూహలం అభిమానుల్లో పెరుగుతోంది. గతంలో బన్నీ కోసం గ్లామర్ టచ్‌ ఇచ్చిన అంజలి, ఇప్పుడు మెగాస్టార్ కోసం మరింత హాట్ అండ్ స్టైలిష్ అవతారంలో కనిపించబోతోందట. అంటే అప్పుడు బన్నీ కోసం అలా.. ఇప్పుడు చిరంజీవి కోసం ఇలా..! ఈ సాంగ్ రిలీజయ్యే సరికి సోషల్ మీడియాలో ఫుల్ ఫైర్ గ్యారంటీ అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమాలో మాలవిక మోహన్.. రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించబోతున్నారని టాక్..!

మరింత సమాచారం తెలుసుకోండి: