ఇక అదే సమయంలో కేజీఎఫ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న “టాక్సిక్” కూడా సమ్మర్‌లోనే రిలీజ్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన “కార్తీక్ వర్మ” కూడా థ్రిల్లర్ జోనర్‌లో సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన “సంబరాల యేటిగట్టు” కూడా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌లో రావాల్సిన ఈ సినిమా సమ్మర్‌కి మారింది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందుతున్న “కొరియన్ కనకరాజు” కూడా రెండు భాషల్లో రిలీజ్ కాబోతోంది. శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో వచ్చిన “భోగి” మాస్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తుంది.
అడివి శేష్ థ్రిల్లర్ “డెకాయిట్” మార్చి 19న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. నిఖిల్ “స్వయంభు” సినిమా సైలెంట్‌గా షూటింగ్ పూర్తిచేస్తుండగా, సమ్మర్‌లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. విశ్వక్ సేన్, అనుదీప్ కెవి కాంబినేషన్‌లో వచ్చిన “ఫంకీ” ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. అక్కినేని అఖిల్ నటించిన “లెనిన్”, బెల్లంకొండ శ్రీనివాస్ “జైంధవ”, కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ”, ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా కూడా ఈ సమ్మర్ రిలీజ్ లైన్‌లోనే ఉన్నాయి. ఇలా చూస్తే 2026 సమ్మర్ బాక్సాఫీస్‌పై హీట్ పెరగడం ఖాయం. యువ హీరోల కాంపిటిషన్‌తో పాటు స్టార్ సినిమాలు కూడా అట్రాక్షన్‌గా మారబోతున్నాయి. ఇక వీటిలో ఏది నిజంగా సమ్మర్ బ్లాక్‌బస్టర్ అవుతుందో చూడాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి