‘అఖండ 2’ మొదటి ఆడియో సింగల్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పటికే ఈ పాట గురించి సంగీత దర్శకుడు థమన్ తెగ ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. “శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ గళాల్లో పాడిన ఈ పవర్‌ఫుల్ ట్రాక్ విన్నాక నిద్ర పట్టలేదు, ఇది శివుడి మహాత్మ్యం,” అంటూ థమన్ చెబుతున్న మాటలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేశాయి. ఈ పాట నిజంగానే అద్భుతంగా ఉంటే, ‘అఖండ 2’ ప్రమోషన్‌కి అదే సరైన ఆరంభం అవుతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి చిన్న టీజర్ తప్ప పెద్దగా ఏ కంటెంట్ రాకపోవడంతో, అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఉంది. యూనిట్ ఇప్పుడు ప్రమోషన్లపై పూర్తి దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.
పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా హైప్ పెంచాలంటే, పాటలతో పాటు టీజర్, ట్రైలర్ కూడా ప్రజల్లో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి.అభిమానులు ఇప్పటికే ఆలస్యం అయ్యిందంటున్నారు. ఇటీవల చరణ్ నటించిన ‘ పెద్ది చికిరి చికిరి ’ సాంగ్ సోషల్ మీడియాలో రచ్చ రేపినట్టు, ఇప్పుడు ఆ స్థాయిలో ఫుల్ ఎనర్జీని ‘అఖండ 2’ నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఫెస్టివల్ ఫీలింగ్ ఉంటుంది. ఫ్యాన్స్ మాత్రం ఈ సారి అంచనాలకు మించిన ఫీల్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు.
అంతేకాక, 14 రీల్స్ టీమ్ రిలీజ్ ముందు రోజు రాత్రే ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తోందన్న సమాచారం ఆసక్తిగా మారింది. ‘ఓజీ’ తరహాలో స్పెషల్ షోలు వేస్తే, పబ్లిసిటీ మరింత పెరుగుతుంది. మొత్తానికి, ‘అఖండ 2’కు ముందున్న మూడు వారాలు కీలకం. ఈ కాలంలో ప్రమోషన్‌లు, మ్యూజిక్, ట్రైలర్ అన్నీ కలిసి ఈ సినిమా స్థాయిని డిసైడ్ చేయబోతున్నాయి. అభిమానులు మాత్రం అఖండను మించి బోయపాటి - బాలయ్య కాంబో మరోసారి శివతాండవం చేయాలని ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి