పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడు ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్ళయ్యాక సినిమాలు మానేసింది. పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ కి ఇద్దరు పిల్లలు పుట్టాక ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు.అలా పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా ని పెళ్లి చేసుకున్నప్పటికీ రేణుదేశాయ్ మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంటుంది. ఇక ఆ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళి తన పిల్లల భవిష్యత్తు కోసం దాన్ని బ్రేక్ చేసుకుంది. ఆ తర్వాత పిల్లలే భవిష్యత్తుగా బతుకుతున్న రేణు దేశాయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం ద్వారా వైరల్ గానే ఉంటుంది.సోషల్ మీడియా ద్వారా ఏ చిన్న విషయం గురించి అయినా సరే స్పందిస్తుంది. ముఖ్యంగా మూగజీవాల పట్ల,ఆడవాళ్లకు జరిగే లైంగిక వేధింపుల పట్ల తన గళం విప్పి మాట్లాడుతుంది. 

ఇక రీసెంట్ గానే రేణు దేశాయ్ ఒక ప్రత్యేక సంస్థను కూడా స్థాపించి క్యాంపెనింగ్ లు,కార్యక్రమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక చాలా సంవత్సరాల నుండి సినిమాలు మానేసిన రేణుదేశాయ్ ఆ మధ్య కాలంలో అంటే 2023లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ద్వారా మళ్ళీ ముఖానికి రంగు వేసుకుంది.అయితే ఈ సినిమా ప్లాఫ్ అయినప్పటికీ రేణు దేశాయ్ పోషించిన పాత్రకి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత రేణు దేశాయ్ మళ్ళీ వరుస సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు మరొక సినిమా అనౌన్స్ చేయలేదు.ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఆయన పిలిస్తే అన్ని వదిలేసి వెళ్తాను అంటూ పెట్టిన పోస్ట్ సంచలనగా మారింది. ఇక ఆ పోస్ట్ ఏంటి దేనికి సంబంధించి పోస్ట్ పెట్టింది అనేది చూస్తే..రేణు దేశాయ్ కి దైవభక్తి ఎంత ఎక్కువో చెప్పనక్కర్లేదు.ఆమె ఎప్పుడూ కూడా ఆరెంజ్ కలర్ నే ఇష్టపడుతుందట. 

కాషాయ రంగు అంటే తనకు ఇష్టమని,ఆ మధ్యకాలంలో సన్యాసం కూడా తీసుకుంటానని చెప్పింది. అలా దైవభక్తి ఎక్కువగా ఉన్న రేణు దేశాయ్ తాజాగా కాశీకి వెళ్లిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకోవడంతో పాటు ఒక  ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది.అందులో ఏముందంటే.. ఈరోజు కాలభైరవ జయంతి.ఈరోజు ఆయన నుండి మనం రక్షణ కోర కూడదు.మనమే రక్షకుడిగా ఉండాలి. ఆ కాలభైరవుడు మీలోనే ఉండి శాంతి వైపు నడిపిస్తాడు. ఒకవేళ పరమశివుడు పిలిస్తే అన్ని వదిలేసి కాశి వెళ్తారు అంటూ రాసుకోచ్చింది. ప్రస్తుతం రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారడంతో ఆమెకి దైవభక్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ కింద నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: