- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా మహేష్‌బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. నవంబర్‌ 15న ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ రానుంది. ఈ ప్రాజెక్ట్‌ మహేష్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సీనియ‌ర్ నిర్మాత డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అభిమానులు ఇప్పటికే ఈ చిత్రం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండు ద‌శాబ్దాల నుంచి ప్ర‌తి తెలుగు సినిమా అభిమాని క‌ల‌లు కంటోన్న ఈ ప్రాజెక్ట్ ఎట్ట‌కేల‌కు ఇప్పుడు సెట్స్ మీద‌కు వెళ్ల‌డంతో ఉత్కంఠ మామూలుగా లేదు.


గ‌త రాత్రి మందాకిని పాత్ర‌లో ప్రియాంక చోప్రా లుక్‌ను రిలీజ్ చేయ‌డం.. లుక్ ఆద్యంతం ఆస‌క్తిగా ఉండ‌డంతో మిగిలిన పాత్ర‌లు ఎలా ఉంటాయా ? అని అంద‌రూ వెయిటింగ్‌లో ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్‌ ఏ ప్రాజెక్ట్‌ చేస్తారనేది ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల లో హాట్‌ టాపిక్‌గా మారింది. రాజమౌళి లాంటి లెజెండరీ దర్శకుడితో సినిమా చేశాక, రొటీన్ కమర్షియల్ సినిమాలకు మహేష్ బాబు దూరంగా ఉంటార‌నే అనుకోవాలి. ఈయ‌న త‌న త‌ర్వాత సినిమా ను కూడా బిగ్ స్కూల్ లో ఉండేలా ప్లాన్ చేయాలి.


ఈ క్ర‌మంలోనే దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా పేరు కూడా చ‌ర్చ‌ల్లో నానుతోంది. గతంలో మహేష్‌తో ఆయన సినిమా దాదాపు ఫైనల్‌ అయ్యింది. అనూహ్యంగా కొన్ని కారణాల తో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సందీప్‌, పెద్ద స్టార్‌ ప్రాజెక్ట్‌లను హ్యాండిల్‌ చేయడంలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో మహేష్‌ తన తర్వాత చిత్రాన్ని సందీప్‌తో చేయాలని అభిమానుల్లో టాక్ వినిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: