తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటి  జ్యోతి రెడ్డి అంటే తెలియని వారు ఉండరు.. ఈమె అప్పట్లో  చాలా చిత్రాల్లో హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. వ్యాంప్ పాత్రల్లో చేసింది.  ముఖ్యంగా జ్యోతి కి పేరు తీసుకొచ్చిన సినిమా ఏంటంటే పెళ్ళాం ఊరెళితే..ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ సరసన జ్యోతి నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన మైలురాయిని ఏర్పాటు చేసుకుంది. ఈ సినిమాకు ముందు జ్యోతి లైఫ్ ఒక విధంగా ఉంటే ఈ సినిమా తర్వాత మరో విధంగా తయారయిందని చెప్పవచ్చు. అలాంటి జ్యోతి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని  చిరంజీవి విజయ్ దేవరకొండ ల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది.. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అందరివాడు మూవీ షూటింగ్ సమయంలో  మేనేజర్ నాకు కాల్ చేసి, చిరంజీవితో ఒక రోల్ ఉంది చేస్తావా అని అడిగారు. 

వెంటనే రోల్ ఏంటో కూడా అడగకుండా ఓకే చెప్పేశాను. షూటింగ్ స్పాట్ కి వెళ్లేసరికి చిరంజీవితో పెళ్లిచూపుల సీన్ ఉంటుంది.. ఆ సీన్ లో నేను లీనమైపోయాను.కానీ సినిమా కథ ప్రకారం చిరంజీవిని పెళ్లి చూపుల్లో చూసి రిజెక్ట్ చేయాలి. నేను మెగాస్టార్ చిరంజీవిని సీన్లో భాగంగా పెళ్లి చూపుల్లో చూసి రిజెక్ట్ చేసి మరో బండోడికి ఓకే చెబుతాను. ఈ సీన్ చక చకా పూర్తయిపోయింది అద్భుతంగా వచ్చింది. సినిమా పరంగా చిరంజీవిని రిజెక్ట్ చేసినా కానీ నా మనసులో మాత్రం అరే నేను చిరంజీవిని రిజెక్ట్ చేశానా అంటూ తనలో తానే అనుకున్నా. అంతేకాదు అద్దం ముందు నిల్చొని నేను చిరంజీవిని రిజెక్ట్  చేయడం ఏంటి.. బండోడికి ఓకే చెప్పడం ఏంటి  కలా నిజమా అంటూ ఆలోచనలో పడిందట. ఎంచక్కా ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే బాగుండు అంటూ తనకు తానే అనుకుందట..

అంతేకాదు అదే ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి కూడా ఆమె మాట్లాడింది. విజయ్ దేవరకొండతో సినిమా ఆఫర్ వస్తే ఎలాంటి సీన్ చేయడానికి అయినా రెడీగా ఉన్నాను. రొమాంటిక్ సీన్స్, లిప్ సీన్స్ ఏవైనా సరే చేస్తాను. విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ విధంగా ఆమె విజయ్ దేవరకొండ తో హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా కానీ చేస్తానని కరాకండిగా చెప్పేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: