సాధారణంగా టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన హీరోయిన్స్‌కు పెద్దగా ఆఫర్లు వెంట వెంటనే రావు. ఇది అందరికి తెలుసు. కొంత కాలం గ్యాప్ తర్వాత ఒక్క రెండు అవకాశాలు వచ్చినా కూడా అవి చాలా సార్లు పెద్దగా వర్కౌట్ కావు. అలా చాలా మందిని చూశాం. అయితే ఈ రూల్‌ అన్నింటినీ బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్న అరుదైన లక్కీ యాక్ట్రెస్స్ కాజల్ అగర్వాల్.తన కెరీర్‌లో ఎప్పుడెప్పుడు, ఏ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినా ఆ సినిమాలో హైలైట్‌గా మారిపోయే ప్రత్యేకత కాజల్‌ది. భగవంత్ కేసరి  సినిమాలో బాలయ్యతో కలిసి నటించి అప్పట్లో మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆ సినిమా తర్వాత బాలయ్యతో మరోసారి కలిసి నటించే ఛాన్స్ ఆమెకు రాలేదు. కానీ ఈసారి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇన్నాళ్లకు మళ్లీ ఆ గోల్డెన్ అవకాశాన్ని కాజల్ లాక్ చేసింది.


ప్రస్తుతం ‘అఖండ 2’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న బాలయ్య, ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమాను సెట్స్‌పైకి తేవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో మొదటి హీరోయిన్‌గా నయనతారను అనుకున్నారని, రెండో కీలక పాత్ర కోసం కాజల్ అగర్వాల్‌ను సంప్రదిస్తున్నారని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.అయితే ఇది కేవలం ‘ఫస్ట్ హీరోయిన్’, ‘సెకండ్ హీరోయిన్’ అనే స్థాయిలో ఉండే రోల్ కాదు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలు కథను పూర్తిగా మలుపు తిప్పే విధంగా డిజైన్ చేశారని, అందుకే ఇద్దరూ సమానంగా స్క్రీన్‌పై కీలకమైన ప్రాధాన్యతను సొంతం చేసుకోబోతున్నారని సమాచారం.



ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో, అంత కీలక పాత్రతో కాజల్ అగర్వాల్ మరోసారి మెరిసేందుకు అవకాశం వచ్చినందుకు ఆమె అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇలాంటి ఛాన్స్ లు అందరికి రావు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఇలాంటి ఆఫర్ దక్కించుకోవడం చాలా పెద్ద విషయమని, కాజల్ ఈ సర్ప్రైజ్‌కు పూర్తిగా అర్హురాలని నెటిజన్లు చెబుతున్నారు. చూద్దాం మరి కాజల్ ఈ అవకాశాన్నీ ఎంత వరకు ఉపయోగించుకుంటుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: