ఇప్పటి వరకు చాలా డైరెక్టర్ల పేర్లు తెర పై వినిపించాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాకు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కి ఛాన్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్‌కి దక్షిణాది లో భారీ క్రేజ్ ఉండడం, ఆయన యాక్షన్ యూనివర్స్‌కి విపరీతమైన మార్కెట్ ఉండటం—అన్ని కూడా ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆల్ మోస్ట్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిపోయిన్నట్లే అంటూ తెలుస్తుంది.
ఇక మరో వైపు, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఒక స్పెషల్ రోల్ కోసం అల్లు అర్జున్‌ను సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ రోల్ పూర్తి పాత్ర కాదు, కేవలం అరగంట వ్యవధి ఉన్న నెగిటివ్ షేడ్స్‌లో కనిపించే క్యారెక్టర్ అని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది బన్నీకి పెద్ద గా క్రేజ్ తెచ్చిపెట్టకపోవచ్చు. బన్నీ మాత్రం పూర్తి స్థాయి, ఫుల్-లెంగ్త్, అతని స్టార్ ఇమేజ్‌ను నిలబెట్టే పాత్రల మీదే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ చెప్పిన స్టోరీను విన్నారనీ, కొన్ని మార్పులు సూచించారనీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా జరుగుతోందనీ సమాచారం అందుతుంది. ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే, ఇది దక్షిణాది ఇండస్ట్రీ మొత్తానికి కాకుండా పాన్ ఇండియా లెవెల్‌లో కూడా సంచలనాన్ని సృష్టించే సినిమా అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..??
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి