ఐ బొమ్మ ఇమ్మడి రవి—గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, సినీ ఇండస్ట్రీలో మారుమ్రోగుతున్న పేరు. ఆయన యవ్వారాల గురించి అందరికి తెలిసిందే. కొందరు ఆయనకి ఉన్న బ్రెయిన్ ను పొగుడుతుంటే మరికొందరు బూతులు తిడుతున్నారు. ఆయన అరెస్టుపై రవి తండ్రి అప్పారావు కూడా స్పందించారు .తన కొడుకు రవిని పోలీసులు అరెస్టు చేశారని బంధువులు చెప్పడంతోనే తెలిసిందని, అంత వరకు తనకు ఏం తెలియదని చెప్పుకొచ్చారు.  పేపర్లలో వచ్చిన ఫోటోలు, యూట్యూబ్ వీడియోలు చూసి నిజం తెలిసిందని ఆయన చెప్పారు. రవిని డిగ్రీ వరకు చదివించి, ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు పంపించానని తెలిపారు. అయితే రవి విదేశాల్లో ఉన్నాడన్న విషయం తనకు తెలియదని అన్నారు. ఈ వయసులో కొడుకును కాపాడే శక్తి, ఓపిక తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు .


అంతేకాదు, “వాడికి అన్ని మంచి బుద్ధులే… కానీ వాడి అమ్మ బ్రెయిన్ వచ్చింది. ఆవిడకి అంతా క్రిమినల్ బుద్ధులే” అని అప్పారావు ఘాటుగా వ్యాఖ్యానించారు.ఇక ఇప్పుడు ఐ బొమ్మ రవి గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అసలు రవికి ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదని, ఇవన్నీ రావడానికి కారణం అతని భార్య అత్యధిక కోరికలేనని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఆవిడ ముందు నుంచే చాలా హై రేంజ్ జీవితాన్ని గడిపే ఆమె ఖర్చులను భరించలేని సమయంలోనే రవికి డబ్బు సంపాదించాలి అన్న ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు.


అంతేకాదు, భార్య తనకు విలువ ఇవ్వకపోవడం, అత్తగారి సూటి–పోటి మాటలు ఇవన్నీ రవిని మెంటల్‌గా ప్రభావితం చేశాయని, ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తప్పుదారిలోకి వెళ్లాడని పోలీసులు వెల్లడించారు.ఇక రవి జీవితానికి సంబంధించిన మరికొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. రవి చాలా టాలెంటెడ్ వ్యక్తి అని, మంచి మనిషి అని ఆయన ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఎవరి పట్లా దురుసుగా ప్రవర్తించేవారు కాదని, ఒక్క చెడు అలవాటు కూడా లేనని వారు పేర్కొంటున్నారు. అతను ఇలా మారడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదని ఆ ఫ్రెండ్స్ అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. “ఇంత టాలెంట్ ఉన్న ఐ బొమ్మ రవి తన ఆలోచనను చెడుగా పెట్టకుండా మంచిగా పెట్టుంటే… ఈపాటికే టాప్ స్టార్ అయ్యేవాడు” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: