భారీ అంచనాలతో తెర కెక్కుతున్న మహేష్ బాబు, రాజమౌళి వారణాసి మూవీకి సంబంధించి రీసెంట్ గా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పేరుతో మూవీ టైటిల్ ని,గ్లింప్స్ ని విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే వారణాసి మూవీ గ్లింప్స్ లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని వీడియో చూస్తే అర్థమవుతుంది.చిన్న గ్లింప్స్ వీడియోలోనే రాజమౌళి ఎంతో అర్ధాన్ని పెట్టారు. అలా సినిమా గ్లింప్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రాజమౌళి ఏదో కొత్త కథతోనే మరోసారి మన ముందుకు రాబోతున్నారని అర్థమవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబుని రుద్ర పాత్రలో..విలన్ గా కుంభ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ని.. హీరోయిన్ గా మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రాని తీసుకున్నట్టు ఫైనల్ చేశారు.అలా టాలీవుడ్ నుండి మహేష్ బాబుని, బాలీవుడ్ హాలీవుడ్ కవర్ చేసేలా ప్రియాంక చోప్రాని, మాలీవుడ్ ని కవర్ చేసేలా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ని తీసుకున్నారు.

అయితే ఇందులోకి మరో ఇండస్ట్రీ నుండి ఇంకో స్టార్ హీరో జాయిన్ అవ్వబోతున్నారట  ఆయన ఎవరంటే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. వారణాసి మూవీలో కన్నడ హీరో కిచ్చా సుదీప్ హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు టాలీవుడ్ సినీ వర్గాల చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం కన్నడ ఇండస్ట్రీ నుండి కిచ్చా సుదీప్ ని హనుమంతుడి పాత్ర కోసం రాజమౌళి ఎంపిక చేసినట్టు వార్తలు వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే రాజమౌళి అన్ని ఇండస్ట్రీలను కవర్ చేసేలా అందరు హీరోలను ఈ సినిమాలో పెట్టుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కొంతమంది కిచ్చా సుదీప్ అభిమానులు మా హీరో హనుమంతుడిగా చేయడం ఏంటి అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మిగతా హీరోలకు కీరోల్స్ ఉంటే కొద్దిసేపు కనిపించే హనుమంతుడి పాత్ర కోసం కిచ్చా సుదీప్ ని తీసుకోవడం ఏంటి..ఒకవేళ హనుమంతుని పాత్ర కోసం ఇందులో కిచ్చా సుదీప్ ని తీసుకుంటే ఆయన పాత్ర సినిమాలో ఎక్కువగా ఉంటే ఓకే కానీ..ఏదో అలా రెండు మూడు సీన్ల కోసం చూపించి వదిలేస్తే మాత్రం బాగోదు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి నిజంగానే కిచ్చా సుదీప్ ని వారణాసి మూవీలో హనుమంతుడి పాత్ర కోసం తీసుకోబోతున్నారా అనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే గానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: