సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తో మంచి విజయం అందుకున్న బ్యూటీ లకు ఆ తర్వాత ఇండస్ట్రీ లో వరుస పెట్టి క్రేజీ సినిమాలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. కొంత మంది విషయంలో మాత్రం ఇది రంగ్ అని ప్రూ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఓ ముద్దుగుమ్మ ఓ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ మూవీ మంచి విజయం అందుకుంది. అందులో ఆమె అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఆమెకు వరుస పెట్టి అవకాశాలు తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఆ తర్వాత ఆమె కు తెలుగు లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇంతకు మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్న తెలుగు లో భారీ అవకాశాలను దక్కించుకోలేకపోయిన ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు రితికా సింగ్. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన గురు అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దానితో ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో వరుస పెట్టి అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది భావించారు. కానీ గురు మూవీ తర్వాత ఈ బ్యూటీ కి పెద్దగా తెలుగులో అవకాశాలు దక్కలేదు. దానితో ఈమె ఇతర భాష సినిమాల్లో కూడా నటించింది. అక్కడ కూడా ఈమెకు భారీ విజయాలు దక్కలేదు. దానితో ప్రస్తుతం ఈమె పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ మామూలు రీతిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: