మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తాజాగా కాంతా అనే సినిమాలో హీరో గా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... రానామూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ మూవీ విడుదల అయిన తర్వాత మొదటి మూడు రోజులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను వసూలు చేసింది. కానీ మొదటి వీక్ డే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 1.06 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 87 లక్షలు , మూడవ రోజు 67 లక్షలు , నాలుగవ రోజు కేవలం 22 లక్షల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

నాలుగు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 1.32 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 20 లక్షలు , ఆంధ్ర లో 1.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి నాలుగు రోజుల్లో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.82 కోట్ల షేర్ ... 5.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 8.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మరో 6.68 కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: