ప్రస్తుతం భారతీయ సినీ అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినీరసికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “ వారణాసి ”. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రపంచ ఖ్యాతి గాంచిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా అనౌన్స్ అయిన రోజునుంచే అద్భుతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రత్యేకంగా విడుదలైన కాన్సెప్ట్ వీడియోలో చూపించిన విజువల్స్ ప్రపంచస్థాయిలో హైప్‌ను సృష్టించాయి. ఈ వీడియోలో చూపించిన రామాయణ విజువల్స్, ముఖ్యంగా మహేష్ బాబు రాముడిగా కనిపించిన షాట్ అభిమానులను ఉర్రూతలూగించింది. అదే వీడియోలో కనిపించిన హనుమాన్ విగ్రహం అతిపెద్ద ఆకర్షణ గా నిలిచింది.
దీంతో అసలు సినిమాలో “ హనుమంతుడు ఎవరు ? ” అనే ప్రశ్న అప్పటినుంచే హాట్ టాపిక్ అయింది. తాజాగా ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమాలో హనుమాన్ పాత్రను ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ పోషిస్తారట. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. మాధవన్ యొక్క లుక్, ఆయన నటనా నైపుణ్యం, ఇటీవల చేసిన పాత్రలు అన్నీ చూస్తుంటే ఆయన హనుమాన్ పాత్రలో కనిపిస్తారనే టాక్ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
ఇక రాజమౌళి సినిమాల విషయంలో నటీనటుల వివరాలు చివరి క్షణం వరకు గోప్యంగానే ఉంచడం సహజమే. అందుకే “ మాధవన్ హనుమానా ? ” అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం రావాలంటే మేకర్స్ స్పందన కోసం వేచి చూడాల్సిందే. ఇక మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నారనే అప్‌డేట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో క్రేజ్ పీక్స్‌కి చేరింది. రాజమౌళి ప్రపంచ స్థాయి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి భారీగా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. “వారణాసి” చుట్టూ ప్రతి చిన్న అప్‌డేట్ కూడా నేషనల్ లెవెల్‌లో వైరల్ అవుతున్న నేపథ్యంలో, హనుమాన్ పాత్రపై జరుగుతున్న ఈ క్రేజీ బజ్ ప్రస్తుతానికి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి