సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తో ఎవరికైతే మంచి క్రేజ్ దక్కుతుందో వారు ఆ ఇండస్ట్రీ లో మంచి అవకాశాలను దక్కించుకొని వాటితో కూడా మంచి విజయాలను అందుకుంటే చాలా తక్కువ కాలం లోనే ఆ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఓ ముద్దు గుమ్మ నటించిన మొదటి తెలుగు సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. దానితో ఆమె వరుస పెట్టి తెలుగు సినిమాల్లో నటిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె మొదటి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఆ తర్వాత మాత్రం ఆమె తెలుగు సినిమాల్లో నటించడంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత ఆమె హిందీ సినిమాలలో నటించి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇంతకు ఆ నటిమణి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని. 

ఈమె వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఇందులో ఈ బ్యూటీ తన అద్భుతమైన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసింది. దానితో ఈ ముద్దు గుమ్మకు యూత్ ఆడియన్స్ లో సూపర్ గా క్రేజ్ వచ్చింది. దానితో ఈమె వరస పెట్టి తెలుగులో సినిమాలు చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె లోఫర్ మూవీ తర్వాత తెలుగు సినిమాల్లో కాకుండా హిందీ సినిమాల్లో నటించడంపై ఆసక్తిని చూపించింది. అందులో భాగంగా హిందీ లో ఎన్నో సినిమాల్లో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: