కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న జన నాయగన్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి ఒక సాంగ్ను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాలను లభించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేటర్ హక్కులను ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లలో ఒకరు అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ దక్కించుకున్నట్లు , ఈయన తెలుగు థియేటర్ హక్కులను 9 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఈయన 9 కోట్ల ధరకు ఈ మూవీ తెలుగు హక్కులను దక్కించుకోవడంతో నాగ వంశీ పెద్ద రిస్క్ చేస్తున్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మన తెలుగు హీరోలు నటించిన చాలా సినిమాలు విడుదల కానున్నాయి. దానితో వాటికే థియేటర్లు పెద్ద ఎత్తున దొరకడం కష్టం అవుతుంది. దానితో ఓ తమిళ హీరో  నటించిన సినిమాకు ఆ సమయంలో పెద్ద ఎత్తున థియేటర్లు దొరకడం కష్టం. మళ్లీ ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా. అలాంటి సినిమాలు చూడడానికి కూడా జనాలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువ. దానితో నాగ వంశీ ఈ సినిమాను అనవసరంగా భారీ ధరకు కొనుగోలు చేశాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: