రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమా లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిం దే . మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండ గా ... నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధి కుమార్ లు ఈ సినిమాలో ప్రభాస్ కి జోడి గా కనిపించబోతున్నా రు . ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. వాటిలో కొన్ని ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఏరియా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించింది. 

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే నార్త్ అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లు జనవరి 8 వ తేదీ నుండి ప్రదర్శించనున్నట్లు కూడా ఈ మూవీ బృందం వారు ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. మరి నార్త్ అమెరికాలో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ కు ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది అనేది చూడాలి. ఈ మూవీ విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉంది. దానితో ఈ మూవీ టికెట్ బుకింగ్ కి నార్త్ అమెరికాలో మంచి రెస్పాన్స్ లభిస్తుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: