ఓజి ఇచ్చిన సెన్సేషన్ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నెలకొన్న ఎనర్జీ ఇప్పుడు పూర్తిగా ఉస్తాద్ భగత్ సింగ్ మీదే ఉంది. ఫస్ట్ తేరి రీమేక్ అనిపించిన ఈ ప్రాజెక్ట్, హరీష్ శంకర్ రీరైటింగ్‌తో ఒరిజినల్ టచ్ అందుకుంటూ, గబ్బర్ సింగ్ తరహా మాస్స్ మేజిక్ మళ్లీ రిపీట్ అవుతుందనే నమ్మకాన్ని క్రియేట్ చేసింది. మధ్యలో జరిగిన గ్యాప్‌లు, షూటింగ్ బ్రేక్స్ ఇవన్నీ ఫ్యాన్స్‌లో డౌట్స్ క్రియేట్ చేసినా ఓజి బ్లాక్‌బస్టర్ రిసెప్షన్ తర్వాత ఉస్తాద్‌పై హైప్ ఒక్కసారిగా రెట్టింపు అయింది. ఇప్పుడు అందరి కళ్లూ ఒక్క ప్రశ్నపైనే ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఎప్పుడు ? అన్నదే ఆ ప్రశ్న. ఇటీవల అల్లరి నరేష్ 12 ఏ రైల్వే కాలనీ ఈవెంట్‌లో హరీష్ శంకర్ “డిసెంబర్‌లో ఫస్ట్ లిరికల్ వస్తుంది” అని క్లారిటీ ఇచ్చాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్ బెంగళూరులో జరిగిన ఆంధ్రకింగ్ ప్రెస్ మీట్‌లో మరింత స్పష్టత ఇచ్చారు.
తమ సంస్థ నుంచి వస్తోన్న “ రామ్ చరణ్ పెద్ది మార్చిలో, ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్‌లో విడుదల అవుతాయి . ” అబ్బాయి (చరణ్) ముందుగా, బాబాయి (పవన్) తర్వాత రావడం ఫిక్స్ అన్నమాట. డేట్ ఇంకా లాక్ కాలేదు కానీ టీజర్ రిలీజ్ టైమ్‌కే ఫైనల్ చేసే అవకాశముందని మైత్రీ టీం చెపుతోన్న మాట. ఎందుకంటే సమ్మర్‌లో చిరంజీవి ‘విశ్వంభర’ కూడా ఉండటంతో క్లాష్ కాకుండా పవన్ సినిమాకు ఇబ్బంది లేకుండా చూడాలన్న ప్లానింగ్‌తో ఉన్నారు. మెగా క్యాంప్ సమ్మర్ మొత్తం బిజీ బిజీగా ఉండనుంది.
చరణ్ – పెద్ది
పవన్ కళ్యాణ్ – ఉస్తాద్ భగత్ సింగ్
చిరంజీవి – విశ్వంభర
వరుణ్ తేజ్ – కొరియన్ కనకరాజు
సాయి ధరమ్ తేజ్ – సంబరాల ఏటిగట్టు
ఇన్ని పెద్ద సినిమాలు వరుసలో ఉన్నప్పుడు నిర్మాతలు ఒకదాని తో ఒకటి పోటీపడకుండా రిలీజ్ డేట్లను ముందుగానే లాక్ చేయాల్సి ఉంటుంది. హైప్ పరంగా ‘పెద్ది’ ఇప్పటికే టాప్‌లో ఉంది. టీజర్, ‘చికిరి చికిరి’ సాంగ్ రెండూ మాస్ దుమ్ము లేపాయి. అదే హైప్‌ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రిపీట్ చేస్తుందని యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కూడా పవన్‌కి సరిగ్గా సరిపోయే మాస్ ఆల్బమ్ ఇచ్చాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఏదేమైనా వచ్చే యేడాది సమ్మర్ పవన్, చరణ్, చిరంజీవి, వరుణ్, సాయి తేజ్‌లతో నిండిపోయే మెగా ఫెస్టివల్ అవడం ఖాయం. అందులో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రత్యేకంగా ఉంటుదనడంలో సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి