అయితే తాజాగా బయటకు వస్తున్న సమాచారం మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంది. అల్లు అర్జున్ మొదట ఈ ఈవెంట్‌కి వస్తానని మాట ఇచ్చినా, అకస్మాత్తుగా ఆయనకు విదేశాల్లో అత్యవసర పనులు రావడంతో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అందుకే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకాలేనని బన్నీ చివరి క్షణంలో తెలిపారట. దీంతో “లాస్ట్ మినిట్ లో బన్నీ షాక్ ఇచ్చాడు ” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోలింగ్, చర్చలు మొదలయ్యాయి.
ముఖ్యంగా గతంలో బాలయ్య–బన్నీ ఇద్దరూ పలు స్టేజ్‌లపై కలిసి కనిపించడంతో ప్రేక్షకుల్లో మంచి హంగామా నెలకొన్న సందర్భాలు ఉన్నాయి. అలానే ఈసారి కూడా ఆ ఎంటర్టైనింగ్ మూమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందనే ఆశలో ఉన్న ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు. ఈవెంట్‌కు హాజరుకావద్దనే బన్నీ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? నిజంగానే విదేశీ పని కారణమా? లేక మరో కారణం ఉందా? అన్న ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక కొంతమంది నెటిజన్లు మాత్రం వేరే కోణంలో వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా పెద్దగా కలసి రారని, ఆ కోల్డ్ వార్ కారణంగానే బన్నీ ఈవెంట్‌కు రావడాన్ని మానేసారని ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఇవి ఎంతవరకు నిజమో తెలియకపోయినా – సోషల్ మీడియాలో మాత్రం ఇదే డిబేట్ హీట్ పుట్టిస్తోంది.
మొత్తం మీద, బోయపాటి–బాలయ్య భారీ అంచనాల సినిమా ఈవెంట్‌కు బన్నీ దూరంగా ఉండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు అసలు నిజం ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం పెరుగుతూనే ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి