నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ "అఖండ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటించి రెండు పాత్రల్లో కూడా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడంతో అఖండ 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు మొదటి నుండి పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. కానీ అవి ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ మాత్రం కాస్త ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై అంచనాలు కాస్త పెరిగాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ని తెచ్చుకుని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు ,  తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రమోషన్లకు చాలా రోజులను కేటాయించి దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. దానితో అఖండ 2 మూవీ యూనిట్ ప్రమోషన్ల విషయంలో సూపర్ ప్లాన్ తో ముందుకు వెళుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: