మన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన తెలుగు అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో కొంత మంది తెలుగమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరారు. అందులో చాందిని చౌదరి ఒకరు. ఈ ముద్దు గుమ్మ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించిన ఆమెకు మంచి గుర్తింపును తీసుకు వచ్చిన సినిమాల్లో మొట్ట మొదటి స్థానంలో ఉండేది కలర్ ఫోటో. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం సుహాస్ హీరో గా రూపొందిన కలర్ ఫోటో అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వచ్చింది. ఈ మూవీ లోని చాందిని చౌదరి నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఒక్క సారిగా ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఈమె నటించిన ఎన్నో సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. 

కానీ అద్భుతమైన విజయం మాత్రం ఈ బ్యూటీ కి దక్కడం లేదు. తాజాగా ఈమె సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది. తాజాగా విడుదల అయిన ఈ సినిమాకు కూడా మంచి టాక్ రాలేదు. దానితో ఈ సినిమా ద్వారా కూడా చాందిని చౌదరికి మంచి విజయం దక్కే అవకాశం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా సినిమాలలో చాందిని చౌదరి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: