ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, “మన శంకర వరప్రసాద్ గారు పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. మా అభిమానులు ఈ సినిమాను తప్పకుండా ప్రేమిస్తారు” అని వెల్లడించారు. ఈ మాటలతోనే సినిమా పై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల (చిరంజీవి కుమార్తె) కలిసి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయని, ప్రతి విభాగానికి అత్యున్నత స్థాయి టెక్నికల్ టీమ్‌ను అనిల్ రావిపూడి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా నయనతార నటిస్తుండటం కూడా సినిమాకు మరో హైలైట్‌గా మారింది. చిరంజీవి–నయనతార కాంబినేషన్ స్క్రీన్ పై మరోసారి అందంగా, ఆకర్షణీయంగా కనిపించబోతోందని సినీ వర్గాలు అంటున్నాయి.
అంతేకాదు, అనిల్ రావిపూడి స్టైల్‌కు సొంతమైన పంచ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్—అన్నీ ప్యాకేజీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమీప వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు పెద్ద స్టార్ హీరోల ఎనర్జీ, కామెడీ, మాస్ ఎలిమెంట్స్—అన్నీ పర్ ఫెక్ట్ గా కుదిరాయి. “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక పండగలా మారబోతోందని ఇప్పటికే వాతావరణం చెబుతోంది. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి