వాస్తవానికి, ఈ కాంబినేషన్‌లో చెప్పబడుతున్న సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అలాగే వరుణ్ తేజ్‌ను పరిశీలించినట్టు ఇండస్ట్రీ టాక్. పాత్రకు వరుణ్ సరిపోతాడని మొదట భావించినప్పటికీ, చివరికి ఆ పాత్రకు సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ మరింత సూటవుతుందని టీమ్ నిర్ణయించింది. దర్శకుడు, రైటర్లు కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, వరుణ్ తేజ్ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తూ “పాత్రకు సాయి తేజ్ బెస్ట్” అని ఓకే చెప్పాడట. దాంతో ఈ ప్రాజెక్ట్ వరుణ్ నుండి సాయిధరమ్ తేజ్ చేతుల్లోకి వెళ్లింది.
అయితే, ఇదే విషయాన్ని కొంతమంది వేరే కోణంలో చూపిస్తూ “మెగా క్యాంప్‌లో అంతర్గత ఇష్యూస్ ఉన్నాయట… కావాలనే వరుణ్ తేజ్ అవకాశాన్ని దూరం చేశారు” అని సోషల్ మీడియాలో రూమర్లను పెంచారు. కానీ తరువాత అసలు నిజాలను టీమ్ స్పష్టంగా బయటపెట్టడంతో ఆ ప్రచారం మొత్తానికి పూర్తి బ్రేక్ పడింది. మూవీ మేకర్స్ నిర్ణయం, పాత్ర డిమాండ్స్, నటుడికి సరిపోయే లుక్ – ఇవే అసలు కారణాలు. మెగా ఫ్యామిలీలో ఎవరికైనా వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదని అప్పటి నుంచే క్లియర్ అయ్యింది. ఇప్పుడు ఈ పాత వార్తలు మళ్లీ ట్రెండ్ అవుతుండడంతో మరోసారి ఈ విషయంపై చర్చ మొదలైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి