పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటైన “ది రాజా సాబ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దర్శకుడు మారుతీ రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి, ఎంతోకాలంగా రెబల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన ఫస్ట్ సింగిల్ “రెబల్ సాబ్” ఎట్టకేలకూ భారీ హైప్ మధ్య ఆన్లైన్‌లో విడుదలైంది. విడుదలైన వెంటనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తూ, ప్రభాస్ ఫ్యాన్స్‌కి నిజంగానే ఒక భారీ ఫీస్ట్‌గా మారింది.సాధారణంగా ప్రభాస్ అంటే యాక్షన్‌ డోమినెంట్ రోల్స్‌ అనే అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ ప్రభాస్‌లో దాగి ఉన్న మరో కోణం — ‘డాన్సర్ ప్రభాస్’ — వింటేజ్ రెబల్ అభిమానులకే బాగా తెలుసు. ముఖ్యంగా వర్షం, చత్రపతి, బిల్లా, మిర్చి వంటి చిత్రాల్లో ఆయన చూపించిన ఎనర్జీ, స్టైల్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేసేవి. అయితే ఆ తరువాత ప్రభాస్ ఎక్కువగా యాక్షన్‌ మరియు ఇంటెన్స్‌ పాత్రలను ఎంచుకోవడం వల్ల అతని డాన్స్ అవతారం కొంతకాలంగా కనిపించలేదు.


కానీ, ఇన్నాళ్ల తర్వాత ఆ పాత ప్రభాస్ ఎనర్జీని, స్టైల్‌ను, గ్రేస్‌ను “రెబల్ సాబ్” సాంగ్‌లో మేకర్స్ మళ్లీ చూపించారు. ఆయన చేసే ప్రతి స్టెప్‌లో కనిపించే లైట్‌నెస్, బాడీ లాంగ్వేజ్‌లో ఉన్న రిఫ్రెష్‌మెంట్, స్క్రీన్‌పై కనిపించే ప్రెజెన్స్— ఇవన్నీ కలిసి అభిమానులకు అదే మిర్చి కాలం ప్రభాస్‌ను గుర్తు చేశాయి. క్లాసిక్ రెబల్ వైబ్స్‌ను తెచ్చిపెట్టిన ఈ సాంగ్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లుగానే అనిపిస్తోంది.సాంగ్ విజువల్స్ కూడా చాలా అట్ట్రాక్టివ్‌గా, కలర్‌ఫుల్‌గా తెరకెక్కించబడాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం చిత్రంలోని కమర్షియల్ టోనికి తగ్గట్టుగా పక్కా ఎంటర్‌టైన్మెంట్‌ ఫ్లేవర్‌తో నిండి ఉంది. ప్రభాస్ పెళ్లి కోసం అతనికి సరిపోయే అమ్మాయి ఎక్కడ ఉందో వెతుకుతున్నట్లుగా, “ఎక్కడో డాబా పై వడియాలు ఆరబెడుతుందా?” అనే సరదా లైన్‌లతో పాటకు కోమలమైన హాస్యాన్ని జోడించారు.



అదేకాక, పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ అన్న భావనను కల్చర్‌లోకి తీసుకువస్తూ, తనే “నెంబర్ 1 బ్యాచిలర్” అంటూ సెట్ చేసుకోవడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే పాయింట్‌గా నిలిచింది. రామజోగయ్య శాస్త్రి క్రియేటివిటీ, మారుతీ కమర్షియల్ నైపుణ్యం, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్—అన్ని ఈ సాంగ్‌ను మరింత ఎంగేజింగ్‌గా మార్చాయి. మధ్య మధ్యలో చొప్పించిన ఫ్యామిలీ ఎమోషన్ టచ్ కూడా సాంగ్‌కు మంచి వార్మ్త్ ని ఇచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: