దీనికి కారణం ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉండటం. ఆయన షెడ్యూల్స్ పూర్తయ్యే వరకు ‘దేవర పార్ట్-2’ ముమ్మరంగా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదట. అయినప్పటికీ సినిమా పనులు ఆగిపోకుండా, ఈ మధ్యలో మ్యూజిక్ వర్క్‌ను ముందుగా ప్రారంభించాలని టీమ్ నిర్ణయించింది. అందులో భాగంగా అనిరుధ్ రవిచందర్‌తో దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొననున్నారని సమాచారం.అలాగే కథ విషయంలో కూడా కొరటాల శివ పెద్ద ఎత్తున మార్పులు చేస్తుండటం గమనార్హం. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా స్క్రీన్‌ప్లేలో కొన్ని స్ట్రాంగ్ ఎలిమెంట్స్ జోడిస్తున్నారట. మొదటి భాగం విజయం తర్వాత ఇది పాన్ ఇండియా స్థాయిలో మరింత గ్రాండ్‌గా కనిపించాలనే లక్ష్యంతో టీమ్ కసరత్తులు చేస్తోంది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కీలక పాత్రలో కనిపించనున్నాడు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్, మురళీ శర్మ వంటి పలువురు ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం ఈ సారి కూడా ప్రధాన హైలైట్‌గా ఉండనుందని అంచనా. మొత్తానికి ‘దేవర పార్ట్-2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటి భాగం ఇచ్చిన హైప్‌ను ఈ సీక్వెల్ మరింత ఎత్తుకు తీసుకెళ్తుందా? అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందా? అన్న అంచనాలన్నీ ఇప్పుడు ఈ సినిమాపైనే నిలిచాయి. చూడాలి మరి ఈ కొరటాల ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..??
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి