బ్లాక్‌బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ తన టీమ్‌, ఫ్రెండ్స్‌కి ప్రేమతో, ఆప్యాయతతో ముందుండే చిరంజీవి, ఈ సారి కూడా తన స్టైల్‌ లో అనిల్‌కు మధురమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. నిన్న అనీల్ పుట్టినరోజు రోజున చిరంజీవి స్వయంగా అనిల్ రావిపూడిని శుభాకాంక్షలు తెలియజేసేందుకు పలకరించడమే కాకుండా, ఆయనకు ఒక అత్యంత ఆకర్షణీయమైన, ఖరీదైన లగ్జరీ వాచ్‌ని గిఫ్ట్‌గా అందించారు. ఈ ప్రత్యేక గిఫ్ట్‌ను అందుకున్న అనిల్ నిజంగా ఎమోషనల్ అయ్యాడని టీమ్‌లోని వర్గాలు చెబుతున్నాయి. గిఫ్ట్ అందుకున్న తర్వాత ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తూ, ఆనందంగా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ ఇచ్చిన ఈ ప్రేమ, ఆప్యాయత, గౌరవం… అనిల్ రావిపూడికి జీవితాంతం గుర్తుండిపోయే మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ గా నిలిచిపోయిందని తెలుస్తోంది.


“మన శంకరవరప్రసాద్ గారు” షూటింగ్‌లో అద్భుత కెమిస్ట్రీ!

ఇద్దరి మధ్య ఉన్న ఈ స్పెషల్ బాండ్‌కి ఇప్పుడు కారణం కూడా ఉంది—అదే ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి & అనిల్ కాంబినేషన్ ఫస్ట్ టైమ్ రావడంతో, ప్రతి అప్‌డేట్ పాన్-ఇండియా స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన  ఫస్ట్ సాంగ్ ‘మీసాల పిల్ల’ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసింది. ‘మీసాల పిల్ల’ పాట తెలుగు సినిమా మ్యూజిక్‌కి కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందని నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.



ఈ సినిమాను సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలతో, భారీ స్కేల్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి రేస్‌లో చిరంజీవి సినిమా అంటే — అది ఎప్పటిలాగే భారీ అంచనాలను, పెద్ద విజయాలను తెచ్చే టైం అనేది అందరికీ తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: