సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, తృప్తి హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్”. ఈ సినిమా అనౌన్స్మెంట్ చాలా కాలం క్రితమే వచ్చేసింది. స్క్రిప్ట్ కూడా పూర్తైపోయింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లాప్ కొట్టడం, టీమ్‌ను ఆశీర్వదించడం ఈ ఈవెంట్‌కి ప్రత్యేక ఆకర్షణగా మారింది. పూజ నుండి వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఒక్క విషయం మాత్రం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది—ప్రభాస్ ఈ కార్యక్రమంలో కనిపించలేదు!


సాధారణంగా ప్రభాస్ తన ప్రతి సినిమా ప్రారంభానికి, పూజా కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యారు. ఆయన లేని పూజ అనేది చాలా అరుదు. అందుకే ఈ సారి ఆయన గైర్హాజరు పై నెటిజన్లు భారీగా చర్చిస్తున్నారు.


ప్రభాస్ ఎందుకు రాలేదన్న విషయంపై రెండు వర్షన్లు వైరల్ అవుతున్నాయి. సందీప్ వంగా ప్రత్యేక లుక్ సీక్రెట్ కోసం అడ్డుకున్నారట. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న రూమర్ ప్రకారం,సందీప్ రెడ్డి వంగా స్వయంగా ప్రభాస్‌ను పూజా కార్యక్రమానికి రాకుండా ఆపారట. దీనికి కారణం ఏమిటంటే…“స్పిరిట్” కోసం ప్రభాస్ ఒక కొత్త లుక్ సిద్ధం చేస్తున్నారు. ఆ లుక్ చాలా ప్రత్యేకమైనది, దాన్ని పబ్లిక్‌గా ఇప్పుడే రివీల్ చేయకూడదని దర్శకుడు భావించారట. అందుకే పూజా కార్యక్రమాల వరకు ఆ లుక్‌ను సీక్రెట్‌గా ఉంచాలని నిర్ణయించారనే టాక్. కాబట్టి ప్రభాస్ హాజరు అయితే లుక్ బయట పడే ప్రమాదం ఉండేదని, అందుకే ఆయనకు ఈవెంట్‌కు రాకుండా సూచించారనేది ప్రచారంలో ఉన్న కథనం. మరో వర్గం మాత్రం దీనిపై వేరే కథ చెబుతోంది. డేట్ మార్చడంతో ప్రభాస్ షూట్‌లో ఉండి రాలేకపోయారట.

 

ప్రభాస్ ప్రస్తుతం ఫారిన్‌లో జరుగుతున్న మరో సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. అసలు పూజను డిసెంబర్ 15న ప్లాన్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల పూజను అకస్మాత్తుగా ముందుకు తెచ్చారట. ప్రభాస్‌కు అప్‌డేట్ ఆలస్యంగా అందడంతో ఆయన షూట్ మధ్యలో వదిలి రావడం సాధ్యపడలేదని టాక్.అందువల్ల దర్శకుడు కాకుండా షెడ్యూల్ మార్పు కారణంగానే ఆయన హాజరవ్వలేకపోయారంటూ మరో సెట్ నెటిజన్లు అంటున్నారు. ఏది నిజం..? అనేదాని పై ఇంకా క్లారిటీ లేదు! నిజం ఏదైనా… ప్రస్తుతం “స్పిరిట్” పూజా కార్యక్రమాలకు ప్రభాస్ గైర్హాజరు కావడం పెద్ద డిస్కషన్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: