దక్షిణాది హీరోయిన్ మీనా సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈ హీరోయిన్ తన నటనతో ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టి సౌత్ నాట స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అలాంటి మీనా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది. ఇక వీరిద్దరిది ప్రేమ పెళ్లి కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లే. అలా తల్లి చెప్పిన మాట జవదాటని మీనా తల్లి చెప్పిన దాని ప్రకారమే విద్యాసాగర్ ని పెళ్లి చేసుకొని కొద్దిరోజులు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో మంది హీరో హీరోయిన్లకు తల్లి, అత్త, అక్క, వదిన పాత్రలు పోషించి మంచి మంచి అవకాశాలు అందుకుంది.ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఆమె కెరియర్ బాగున్న సమయంలో సడన్గా భర్త మరణం ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసేసింది.

 కరోనా సమయంలో విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యతో మరణించడంతో మీనా ఒంటరి అయిపోయింది.. ఇక భర్త చనిపోయిన బాధ నుండి మీనా బయటపడడానికి చాలా రోజుల సమయం పట్టింది. అలా ఆ డిప్రెషన్ నుండి బయటపడిన మీనా మళ్ళి సినిమాల్లో బిజీ అవుతూ వీలైనంతవరకు తన కూతురు ఫ్యామిలీతో గడపడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలోనే భర్త చనిపోయిన నెలరోజులకే మీనా రెండో పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో దారుణంగా వైరల్ అయ్యాయి. ఏ హీరో విడాకులు తీసుకున్నా సరే మీనాతో రెండో పెళ్లి అయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చేసరికి ఈ రూమర్స్ పై చాలా సార్లు అసహనం వ్యక్తం చేసింది హీరోయిన్ మీనా.

అలా ఇప్పటికే ఎన్నోసార్లు తన రెండో పెళ్లి వార్తలు ఖండించిన మీనా తాజాగా మరోసారి ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో మీనా ఏం చెప్పిందంటే.. నా రెండో పెళ్లి గురించి నాకంటే ఎక్కువగా మీకే ఆసక్తి ఉంది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు మరో పెళ్లి చేసుకోవాల్సిన ఆలోచన కూడా లేదు.నా కూతురుతో నేను సంతోషంగా ఉంటే నా రెండో పెళ్లి విషయంలో మీకెందుకు అంత ఇంట్రెస్ట్.. ఇండస్ట్రీలో ఉన్న ఏ నటుడు విడాకులు తీసుకున్నా నాతోనే ముడి పెడుతున్నారు.ఇకనైనా ఈ వార్తలు ఆపండి.ప్రస్తుతం నా పూర్తి కాన్సన్ట్రేషన్ సినిమాలపైనే ఉంది.నటన అంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను.ఇలాంటి చెత్త వార్తలు మళ్లీ మళ్లీ ప్రచారం చేయకండి అంటూ రెండో పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది నటి మీనా.

మరింత సమాచారం తెలుసుకోండి: