నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటూ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంటున్నారు. వరుసగా విడుదలైన ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడంతో బాలయ్య బాబు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ప్రేక్షకుల్లో కూడా ఆయన సినిమాలపై ఎప్పటిలాగే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి చేసిన ‘అఖండ 2 – తాండవం’ చిత్రం ప్రమోషన్స్‌లో బాలయ్య బిజీగా పాల్గొంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జరుగుతున్న ఈ ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే మంచి హైప్‌ను సృష్టించాయి. మొదటి భాగం సత్తా ఏంటో చూపిన తర్వాత, సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో అపారమైన ఆసక్తి నెలకొంది.


ఇదిలా ఉండగా, మరోవైపు బాలయ్య గోపీచంద్ మలినేనితో కూడా ఒక భారీ మాస్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో బాలయ్య ఇంతకు ముందు చేసిన ‘వీర సిమ్హా రెడ్డి’ మంచి ఫలితాలను అందించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై మరింత బజ్ పెరిగింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను వచ్చే నెల మూడో వారం నుంచి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ షెడ్యూల్‌లో ప్రత్యేకంగా ఒక స్పెషల్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా ఉండబోతుందని, ఆ పాట కోసం గ్లామర్ డాల్ తమన్నా భాటియాను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

 

బాలయ్య–తమన్నా కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలా కనపడుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమన్నా అందం, బాలయ్య తో మాస్ స్టెప్స్  కలిసి ప్రేక్షకులకు పక్కా విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది బాలకృష్ణ కెరీర్‌లో 111వ సినిమాగా రూపొందుతుండటంతో, అభిమానుల్లో ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని టీమ్ తెలిపింది. బాలయ్య–గోపీ మలినేని కాంబినేషన్ మళ్లీ మాస్ ఫెస్టివల్ ఇవ్వబోతోందని టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: