ఒక మిడ్ రేంజ్ హీరో చేసిన పని ఇప్పుడు నిర్మాతకి హార్ట్ అటాక్ తెప్పించిన పని అయ్యింది. ఇతగాడు ఓ హీరో. హీరో అంటే హీరో అంతే. చెప్పుకో తగ్గ హిట్స్ లేవ్.  పెద్దగా బ్లాక్‌బస్టర్ హిట్లు ఏవీ లేవు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు అనిపించే పరిస్థితి కూడా కాదు. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. అవి హిట్ అవుతాయి ఇలాంటి టైమ్‌లో అతడికి ఒక సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలిసింది. ఆ సినిమా విషయంలో ఓ దర్శకుడు హీరో పేరును రిఫర్ చేయగా, ఓ నిర్మాత కూడా సానుకూలంగా స్పందిస్తూ “సై” అన్నట్టుగా చెప్పారట.


ప్రాజెక్ట్‌ చేసే ఆలోచనకు వచ్చే సరికి సహజంగానే కమర్షియల్ అంశాలన్నీ చర్చకు వస్తాయి. రెమ్యునరేషన్, లాభాలు, బడ్జెట్ — ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండగా అసలు సంగతీ అప్పుడే బయటపడింది. హీరో తన పారితోషికంగా నేరుగా 18 కోట్లు కావాలని చెప్పాడట. దీన్ని విన్న నిర్మాత నిటారుగా షాక్ అయ్యారట. ఎందుకంటే, మొత్తం సినిమా బడ్జెట్‌ దగ్గరగా ముప్పై కోట్లలోనే పూర్తి చేస్తామనే లెక్కలు వేసుకున్నారు. కానీ ఇతగాడి రెమ్యూనరేషన్ విని షాక్ అయ్యారట.  ఆయన వేసుకున్న లెక్కలు వేరు. అన్ని పోను ఆయన ఓ 5 కోట్లు రిస్క్ చేసే విధంగా అనుకున్నారు.  హీరో రెమ్యునరేషన్ ఒక్కటే 18 కోట్లు కావాలని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్‌ను సింపుల్‌గా పక్కన పెట్టేశారట.



ఈ ఘటనతో మళ్లీ ఒక విషయం స్పష్టమైంది — చాలా మంది హీరోలకు గ్రౌండ్ రియాలిటీ అంతగా తెలియదు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. అందుకే మెల్లిగా రెమ్యునరేషన్‌కు బదులు భాగస్వామ్యం, లేదా సినిమా లాభాలలో వాటా తీసుకునే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇది నిర్మాతలకు కూడా, హీరోలకు కూడా మంచిదే.త్వరలో విడుదల కానున్న ఒక సినిమాలో ఓ యంగ్ హీరో తన మొత్తం రెమ్యునరేషన్‌కి బదులుగా రెండు ఏరియాల హక్కులు, అదనంగా కొంత నగదు తీసుకోవడం జరిగింది. కొంత మంది హీరోలు కెరియర్ కోసం సినిమాలు చేస్తుంటే..మరికొందరు డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నారు అని చెప్పడానికి ఇది పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్..!

మరింత సమాచారం తెలుసుకోండి: