తెలుగు సినీ పరిశ్రమ లో మంచి గుర్తింపున సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురిం చి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటిం చి అందులో కొన్ని మూవీ ల తో మంచి విజయాలను అందుకొని తనకంటూ టాలీవుడ్ ఇండ స్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇక పోతే ఆఖ రు గా నిఖిల్ కి కార్తికేయ 2 అనే సినిమాతో మంచి విజయం దక్కింది . ఆ తర్వాత ఈయన చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలతో ఈయనకి ఒక్క మంచి విజయం కూడా దక్కలేదు. ఆఖరుగా నిఖిల్ "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ భారీ ప్లాప్ ను సొంతం చేసుకుంది.

ఇకపోతే నిఖిల్ తాజాగా స్వయంభు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే స్టార్ట్ అయింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ లో సంయుక్త మీనన్ , నబా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. కార్తికేయ  2 సినిమా తర్వాత నిఖిల్ నటించిన 18 పేజీస్ , స్పై , అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలతో వరసగా మూడు అపజయాలను అందుకున్నాడు. మరి స్వయంభూ సినిమాతో ఈయన ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: