విడుదల ముందే లాభాలు.. ఇది రికార్డే!..ఆది సాయికుమార్ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుంటే, 'శంబాల' సినిమా విడుదల కంటే ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కులను అమ్ముకోవడం ఒక గొప్ప విజయంగా పరిగణించాలి. ఓటీటీ హక్కులు: ఇటీవల విడుదలైన ట్రైలర్ సృష్టించిన బజ్ కారణంగా, ఓటీటీ దిగ్గజం ‘ఆహా’ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. శాటిలైట్ హక్కులు: శాటిలైట్ హక్కులను ‘జీ’ ఛానెల్ సొంతం చేసుకుంది. ఈ రెండు డీల్స్ ద్వారా నిర్మాతలు దాదాపు రూ.7 కోట్ల వరకూ వెనక్కి తెచ్చుకోగలిగారు. హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలే ఓటీటీ డీల్స్ క్లోజ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో, 'శంబాల' డీల్ క్లోజ్ చేసుకోవడం గొప్ప బేరమే. ఇది ఆది కెరీర్‌కు కొంత ఊరటనిచ్చే విషయం.
కెరీర్‌కు చావో-రేవో!. 'శంబాల' విజయంపైనే ఆది సాయికుమార్ కెరీర్ పూర్తిగా ఆధారపడి ఉంది. ఈ సినిమా అటూ ఇటు అయితే, తన కెరీర్ గల్లంతైనట్టేనని ఆయనకు కూడా తెలుసు. అందుకే, సినిమా విషయంలో ప్రతి అడుగూ చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. ఓటీటీ, శాటిలైట్ డీల్స్ ద్వారా నిర్మాతలకు కొంతవరకు భరోసా లభించినా, పూర్తి స్థాయిలో సేఫ్ అవ్వాలంటే మాత్రం బాక్సాఫీసు వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టుకోవాల్సిందే. పూర్తి పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడంతో పాటు, లాభాలను అందుకోవాలంటే ప్రేక్షకాదరణ తప్పనిసరి. ఉగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆది సాయికుమార్‌కు తప్పక విజయాన్ని అందించాలని, ఆయన ఫ్యాన్స్, సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఈ సినిమా సాధించే ఫలితం టాలీవుడ్‌లో ఆది సాయికుమార్‌కు తిరిగి మంచి అవకాశాలను తెస్తుందో లేదో డిసెంబర్ 25న తేలిపోనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి