పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెబల్ స్టార్ ప్రభాస్ సిద్ధమవుతున్న సినిమా 'స్పిరిట్'. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'పోలీస్ కాప్' స్టోరీపై అంచనాలు మామూలుగా లేవు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', ముఖ్యంగా 'యానిమల్' వంటి సంచలనాలు సృష్టించిన వంగా.. ఇప్పుడు ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడో అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమా ముహూర్తం ఘనంగా జరిగింది. ఈ లాంచింగ్‌తోనే సినిమాపై హైప్ డోస్ పీక్స్ చేరుకుంది. ప్రభాస్ నుంచి అభిమానులు కోరుకునే పవర్ ప్యాక్డ్ మాస్ ట్రీట్‌మెంట్ 'స్పిరిట్'లో పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు.


రణబీర్ కపూర్ ఎంట్రీ.. హిస్టరీ రిపీట్!
ఇదంతా ఒకెత్తైతే, ఇప్పుడు 'స్పిరిట్' సినిమా గురించి వచ్చిన ఒక హాట్ న్యూస్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టిస్తోంది! ఆ న్యూస్ మరేదో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో, 'యానిమల్' ఫేమ్ రణ్ బీర్ కపూర్ 'స్పిరిట్'లో భాగం కాబోతున్నాడనే వార్త! ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ ఒక గెస్ట్ రోల్, అంటే అతిథి పాత్రలో మెరవనున్నాడట! సినిమాలోని ఒక అత్యంత కీలకమైన సన్నివేశంలో రణ్ బీర్ కపూర్ పవర్ ఫుల్ ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ ఒకే సినిమాలో నటించడం ఇదే తొలిసారి. ఈ క్రేజీ కాంబినేషన్‌కు పునాది పడితే.. ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు.



సందీప్ వంగా మాస్టర్ ప్లాన్!
'యానిమల్' బ్లాక్‌బస్టర్ తర్వాత రణ్ బీర్ కపూర్‌తో సందీప్ రెడ్డి వంగాకు ఉన్న అనుబంధం ఎంత గట్టిదో అందరికీ తెలుసు. ఆ స్నేహం కారణంగానే ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో రణ్ బీర్ కపూర్ అతిథి పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్ నడుస్తోంది. సందీప్ వంగా వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్.. 'స్పిరిట్' సినిమా రీచ్‌ను ఊహించని స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. ప్రభాస్ మాస్ ఫాలోయింగ్, రణ్ బీర్ బాలీవుడ్ పవర్ కలగలిస్తే.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవడం గ్యారెంటీ! వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణంతో పాటు, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్.. నిజంగానే ఒక పాన్ ఇండియా మహాసంగ్రామం కాబోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చే ఈ సంచలన వార్తపై అధికారిక ప్రకటన కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. సందీప్ మామ.. ఏం ప్లాన్ చేస్తున్నావో, ఏం హై ఇవ్వబోతున్నావో తెలియాలంటే 'స్పిరిట్' మరిన్ని అప్‌డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే! పాన్ ఇండియా హిస్టరీ రాసేందుకు ప్రభాస్ – రణ్ బీర్ రెడీ!

మరింత సమాచారం తెలుసుకోండి: