టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకుని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలుగా కేరిర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓ టి టి బిజినెస్ విషయంలో అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ హక్కులను 155 కోట్లకు ఓ ప్రముఖ ఓ టీ టీ సంస్థ కొనుగోలు చేసింది.

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "పెద్ది" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బుచ్చిబాబు సనా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ఓ ప్రముఖ సంస్థ వారు 130 కోట్ల ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక పెద్ది సినిమా ఓ టీ టీ హక్కుల కంటే కూడా దేవర పార్ట్ 1 మూవీ ఓ టీ టీ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: