రాజమౌళి - మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్ మూవీ గురించి రోజుకో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అనగానే అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే భారీ స్థాయిలో ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, 'వారణాసి' అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 650 కోట్ల రూపాయల రికార్డు ఆఫర్‌ను చిత్ర యూనిట్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఒక సినిమా డిజిటల్ హక్కుల కోసం ఈ స్థాయిలో ఆఫర్ రావడం ఇదే తొలిసారి కావచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, దర్శకుడు రాజమౌళి (జక్కన్న) ఈ భారీ 650 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సినిమా కంటెంట్, అది తీసుకురాబోయే ప్రపంచవ్యాప్త క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి మరింత పెద్ద డీల్ కోసం ఎదురు చూస్తున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో నిజమెంత? రాజమౌళి నిజంగానే ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారా? లేక ఇది కేవలం ప్రాజెక్ట్ చుట్టూ మరింత హైప్ పెంచడానికి వచ్చిన వార్త మాత్రమేనా? అనేది తెలియాల్సి ఉంది.
ఏదేమైనా, 650 కోట్ల రూపాయల డీల్‌ను నిరాకరించడం అనేది సాధారణ విషయం కాదని, రాజమౌళి తన సినిమాపై ఎంత నమ్మకంతో ఉన్నారో దీని ద్వారా అర్థమవుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి - మహేష్ కాంబినేషన్ మూవీపై అంచనాలు ఈ రకంగా రోజురోజుకు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ ఎప్పుడు విడుదలైనా రికార్డులు తిరగరాస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి