ఫైనల్ గా సమంత రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. సమంత రాజ్ ల వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో చాలామంది అభిమానులు, సెలబ్రిటీలు వారికి కంగ్రాట్స్ చెబుతూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య గతంలో మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది. క్రిమినల్ అంటూ నాగచైతన్య మాట్లాడిన ఈ వీడియో సమంత రెండో పెళ్లి వేళ చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఏ విధంగా స్పందించారు అనేది ఇప్పుడు చూద్దాం. సమంత నాగచైతన్యల విడాకుల తర్వాత  ఎవరి లైఫ్ వారు చూసుకున్నారు.అయితే ఈ విడాకులపై ఇప్పటివరకు ఎవరు స్పష్టంగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ పలు ఇంటర్వ్యూలలో ఈ జంట పరోక్షంగా కొన్ని విషయాలు బయట పెట్టారు. ముఖ్యంగా సమంత కరణ్ జోహార్ హోస్ట్ గా చేసిన షోలో నా మాజీ నేను ఒకే రూమ్ లో ఉంటే అక్కడ పదునైన వస్తువులు ఉండకుండా చూసుకోవాలి అని చెప్పింది.
\
దీని ప్రకారం సమంతకి నాగచైతన్య మీద ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ నాగ చైతన్య మాత్రం ఎప్పుడూ సమంత పై కోపమున్నట్లు మాట్లాడలేదు. సమంత కనిపిస్తే హాయ్ చెప్పి హగ్ ఇస్తానని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఓ పాడ్ కాస్ట్ లో నాగచైతన్య సమంతతో విడాకుల గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం పరిస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము. కానీ ఈ విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండే బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అందుకే ఒక బంధాన్ని బ్రేక్ చేసుకునే సమయంలో ఒకటికి 1000 సార్లు ఆలోచించాను. వెయ్యి సార్లు ఆలోచించాకే ఇద్దరం విడిపోయాం. ఆ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాం. కానీ అది హెడ్ లైన్స్ గా మారింది. మేమేం చెప్పినా కూడా దాన్ని నెగిటివ్ గానే తీసుకున్నారు.

ఇప్పుడు నేను ఇంకా దాని గురించి మాట్లాడితే ఆర్టికల్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి ఆర్టికల్స్ లో రాస్తూనే ఉంటారు. దీన్ని స్టాప్ చేయాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంది. ఇక నా జీవితంలో ఆమె కూడా భాగం అయింది కాబట్టి విడిపోయాక ఇద్దరం మువ్ ఆన్ అయిపోయాం. కానీ సమాజం మాత్రం నన్ను క్రిమినల్ గా చూసింది.నా లైఫ్ లో జరిగినట్టు చాలా మంది లైఫ్ లో కూడా జరిగింది. కానీ నన్ను ఒక్కడిని క్రిమినల్ గా చూడడం ఎందుకు. పరస్పర అంగీకారంతో ఇద్దరం విడిపోతే మా పర్సనల్ కొంతమందికి ఎంటర్టైనింగ్ గా మారిపోయింది.గాసిప్ ల, రూమర్ల దాన్ని తరచూ స్ప్రెడ్ చేస్తూ హెడ్లైన్ గా మార్చుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇది ఆగడం లేదు. విడిపోయినప్పటికీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది అంటూ నాగచైతన్య ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: